
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఒకటైన పత్తి మార్కెట్ యార్డు నిర్లక్ష్యం నీడలో కొనసాగుతుంది
వ్యవసాయ మార్కెట్ కు గత మూడు రోజులుగా సెలవులు రావడం తో కోట్లు విలువ చేసే పత్తిని మార్కెట్లో ట్రేడర్స్ నిల్వ ఉంచారు. లారీలు లేకపోవడం వలన తాము ఖరీదు చేసిన పత్తిని తరలించేందుకు వీలు లేక అక్కడే ఉంచారు కొందరు మార్కెట్ యార్డులో చీకటి వేళల్లో అసాంఘిక కార్యక్రమాలు పాల్పడుతున్నారని అదే అదును చూసుకోన్న కొంతమంది ఆకతాయిలు మార్కెట్లోకి లోపలికి మందు. జాయి తాగుతూ వ్యాపారులను భయాందోళనకు గురి చేస్తున్నారు శనివారం రాత్రి మార్కెట్లోకి ప్రవేశించిన గుర్తుతెలియని కొంతమంది గంజాయి సేవించి అక్కడ నిల్వ ఉంచిన పత్తి బస్తాలకు నిప్పంటించారు ఎక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు మార్కెట్ అధికారులకు సమాచారం అందించడంతో హుటాహుటిన ఫైర్ ఇంజన్ సిబ్బందితో మాట్లాడి ఆ మంటలని అదుపులోకి తీసుకురావడం వలన కోట్లు విలువ చేసే పత్తి దగ్ధం కాకుండా కాపాడగలిగారు. సంఘటన స్థలానికి చేరుకొని వ్యాపారులు కొనుగోలుదారులు చేసిన పత్తికి రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు సమయానికి ఫైర్ ఇంజన్ లేకపోతే జే విజ్ఞేశ్వర కాటన్ ట్రేడర్స్ 16 బస్తాలు పత్తి కాళీ బూడిద అయిపోయేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇంత జరుగుతున్న పోలీసులు ఆకతాయని కట్టడి చేయడంలో మీనవేషాలు లెక్కబెడుతున్నట్లు అర్థమవుతుంది పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నామంటూ గంజాయి అమ్మకాలను తగ్గిస్తున్నామని ఆర్భాటంగా ప్రచారాలు తప్ప ఆచరణలో మాత్రం వారికి సాధ్యపడట్లేదని ఈ సంఘటన ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఖమ్మంలో ప్రధానంగా మూడో పట్టణ ప్రాంతంలో చాలామంది యువత గంజాయి తాగుడుకు అలవాటు పడి వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు చూస్తూ ఉన్నారే తప్ప చర్యలు తీసుకోవడంలో విఫలం చెందుతున్నారని తెలుస్తుంది శ్రీనివాస నగర్ సుందరయ్య నగర్ మ ప్రకాష్ నగర్ మార్కెట్ యార్డ్ ప్రాంతంలో ప్రకాష్ నగర్ పొలాల ఆసరాగా చేసుకొని గంజాయి తాగుతూ దాడులకు పాల్పడుతూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు
