అభివృధ్ధి పనులను ప్రారంభించిన మంత్రి పువ్వాడ.
▪️మల్లేపల్లి, రాములు తండా, బావోజి తండా, జింకల్ తండా, పరికలబొడు తండా గ్రామాల్లో మొత్తం 30 పనులకు గాను రూ.1.13 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం.
ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలంలో పలు గ్రామాల్లో చేపట్టిన 36 పనులకు గాను రూ.1.13 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ప్రారంభించారు.
మల్లేపల్లి గ్రామంలో 9పనులకు గాను రూ.26.20 లక్షలు, రాములు తండా గ్రామంలో 5 పనులకు గాను రూ.20 లక్షలు, బావోజి తండా గ్రామంలో 11 పనులకు గాను రూ.33 లక్షలు, జింకల్ తండా గ్రామంలో 9 పనులకు గాను రూ.26.10 లక్షలు, పరికలబొడు తండా గ్రామంలో 2 పనులకు గాను రూ.7.75 లక్షలు మొత్తం పూర్తి అయిన అభివృద్ధి పనులు రూ.1.13 కోట్ల రూపాయల విలువైన సీసీ రోడ్లు, సీసీ కాల్వలను మంత్రి పువ్వాడ ప్రారంభించారు.
ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండలంలోనే అత్యధిక నిధులు కేటాయించడం జరిగిందని, కోట్ల రూపాయలు వెచ్చించి ప్రతి గ్రామంలో BT, CC రోడ్లతో పాటు, ప్రతి గల్లీలో సిసి రోడ్లు వేసి అన్ని సౌకర్యాలు కల్పించామని స్పష్టం చేశారు.

ByVNB News

Feb 20, 2023

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed