Post navigation అభివృధ్ధి పనులను ప్రారంభించిన మంత్రి పువ్వాడ.▪️మల్లేపల్లి, రాములు తండా, బావోజి తండా, జింకల్ తండా, పరికలబొడు తండా గ్రామాల్లో మొత్తం 30 పనులకు గాను రూ.1.13 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం.ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలంలో పలు గ్రామాల్లో చేపట్టిన 36 పనులకు గాను రూ.1.13 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ప్రారంభించారు.మల్లేపల్లి గ్రామంలో 9పనులకు గాను రూ.26.20 లక్షలు, రాములు తండా గ్రామంలో 5 పనులకు గాను రూ.20 లక్షలు, బావోజి తండా గ్రామంలో 11 పనులకు గాను రూ.33 లక్షలు, జింకల్ తండా గ్రామంలో 9 పనులకు గాను రూ.26.10 లక్షలు, పరికలబొడు తండా గ్రామంలో 2 పనులకు గాను రూ.7.75 లక్షలు మొత్తం పూర్తి అయిన అభివృద్ధి పనులు రూ.1.13 కోట్ల రూపాయల విలువైన సీసీ రోడ్లు, సీసీ కాల్వలను మంత్రి పువ్వాడ ప్రారంభించారు.ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండలంలోనే అత్యధిక నిధులు కేటాయించడం జరిగిందని, కోట్ల రూపాయలు వెచ్చించి ప్రతి గ్రామంలో BT, CC రోడ్లతో పాటు, ప్రతి గల్లీలో సిసి రోడ్లు వేసి అన్ని సౌకర్యాలు కల్పించామని స్పష్టం చేశారు. కుట్టు మెషీన్ లు పంపిణి చేసిన మంత్రి పువ్వాడ.▪️శిక్షణ పొందిన 41 మందికి ఉచితంగా కుట్టు మెషీన్ల పంపిణీ.మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అన్నారు.సోమవారం ఖమ్మం జిల్లా కేంద్రం సుగ్గలవారి తోట నందు మహిళలకు జన శిక్షన్ సంస్తాన్ వారి అధ్వర్యంలో తరుపున ఉచితంగా శిక్షణ ఇచ్చి 41 మంది మహిళలకు NRI ఫౌండేషన్ మరియు శ్రీ మిత్ర ఫౌండేషన్ అధ్వర్యంలో సమకూర్చిన కుట్టు మెషీన్ లను మంత్రి పువ్వాడ చేతుల మీదగా పంపిణీ చేశారు.స్వయం ఉపాధి టైలరింగ్‌లో శిక్షణ పొందిన కుట్టు మిషన్, ధృవీకరణ పత్రాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. ఇంట్లోనే మహిళలకు ఉపాధి కల్పించేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.మహిళలు ఆర్ధికాభివృద్ధి సాధించాలంటే ముందు వారికి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కుటుంబంలో భర్తకు చేదోడు వాదోడుగా ఉండేందుకు టైలరింగ్ మంచి ఉపాధి అని అన్నారు.