Post navigation కుట్టు మెషీన్ లు పంపిణి చేసిన మంత్రి పువ్వాడ.▪️శిక్షణ పొందిన 41 మందికి ఉచితంగా కుట్టు మెషీన్ల పంపిణీ.మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అన్నారు.సోమవారం ఖమ్మం జిల్లా కేంద్రం సుగ్గలవారి తోట నందు మహిళలకు జన శిక్షన్ సంస్తాన్ వారి అధ్వర్యంలో తరుపున ఉచితంగా శిక్షణ ఇచ్చి 41 మంది మహిళలకు NRI ఫౌండేషన్ మరియు శ్రీ మిత్ర ఫౌండేషన్ అధ్వర్యంలో సమకూర్చిన కుట్టు మెషీన్ లను మంత్రి పువ్వాడ చేతుల మీదగా పంపిణీ చేశారు.స్వయం ఉపాధి టైలరింగ్‌లో శిక్షణ పొందిన కుట్టు మిషన్, ధృవీకరణ పత్రాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. ఇంట్లోనే మహిళలకు ఉపాధి కల్పించేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.మహిళలు ఆర్ధికాభివృద్ధి సాధించాలంటే ముందు వారికి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కుటుంబంలో భర్తకు చేదోడు వాదోడుగా ఉండేందుకు టైలరింగ్ మంచి ఉపాధి అని అన్నారు. అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి పువ్వాడ.ఖమ్మం జిల్లా పరిషత్ ప్రధాన కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ఆవిష్కరించారు.రాజ్యాంగ నిర్మాణకర్త DR.BR అంబేడ్కర్ గారి స్ఫూర్తితో రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక పథకాలు రూపొందించి అమలు చేస్తున్నారని అన్నారు. వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వం అనేక గొప్ప గొప్ప స్థాయిలో అనేక అవకాశాలు కల్పిస్తుందన్నారు.ముఖ్యమంత్రి కేసిఆర్ అంబేద్కర్ స్పూర్తితో ఆయన ఆశయాలను అమలు చేస్తూ నిజమైన అంబేద్కర్ వాదిగా రాష్ట్రంలో పాలన చేస్తున్నారన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా సిఎం కేసిఆర్ గారి పాలన నేడు దేశానికి దిక్సూచిగా మారిందన్నారు.Zp చైర్మన్ లింగాల కమల్ రాజ్ గారి అధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీ నామ నాగేశ్వరరావు గారు, కలెక్టర్ గౌతమ్ గారు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు, ఎమ్మెల్సీ తాత మధు గారు, ఎమ్మెల్యే రాములు నాయక్ గారు, మేయర్ పునుకొల్లు నీరజ గారు, సుడా చైర్మన్ విజయ్ కుమార్ గారు, జడ్పీటీసీలు, ఎంపీపీలు తదితరులు పాల్గొన్నారు.