పొలిటికల్ పవర్ న్యూస్ 9 ప్రతినిధి వెంపటి నాయుడు

సకల సౌకర్యాలతో కార్పొరేట్ కి ధీటుగా ప్రభుత్వ విద్యా..

▪️విడతల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలు ఆధునీకరణ.. నాణ్యమైన విద్య.

▪️ రూ.16.92 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి పువ్వాడ.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు- మనబడి -మన బస్తీ-మన బడి కార్యక్రమం మంచి ఫలితాలు అందివస్తున్నాయని, సకల సౌకర్యాలతో కార్పొరేట్ కి ధీటుగా ప్రభుత్వ విద్యాను ప్రతి పేదవాడికి అందిస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అన్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం లోని అచ్చుతాపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రూ.16.92 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఎమ్మేల్యే మచ్చా నాగేశ్వరరావు గారితో కలిసి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ప్రారంభించారు..

అనంతరం సరస్వతి తల్లి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు.

అనంతరం జరిగిన సభలో మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు తమ పిల్లలు ఆంగ్ల మాధ్యమం లో చదవాలని, ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశపడతారని చెప్పారు. అలాంటి వారి కోరికను రాష్ట్ర ప్రభుత్వం పరిగణంలోకి తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్యను బలోపేతం చేసి ఆయా పాఠశాలల్లో అన్ని మౌలిక వసతులు కల్పించి నాణ్యమైన, ఉన్నత ప్రమాణాలతో విద్య ను అందించాలని ముఖ్యమంత్రి కేసీఅర్ గారు నిశ్చయించుకున్నారని అన్నారు.

ఆయా పాఠశాలల్లో టాయిలెట్స్ నిర్మాణం, తాగునీటి వసతి కల్పన, అవసరమైన మరమ్మతులు, విద్యుత్తు సౌకర్యం, ఫర్నీచర్‌, గ్రీన్‌ చాక్‌పీస్‌ బోర్డుల ఏర్పాటు, ప్రహరీగోడలు, అదనపు తరగతి గదులు, డైనింగ్‌హాళ్ల నిర్మాణం, పెయింటింగ్‌, డిజిటల్‌ విద్యకు అవసరమైన ఏర్పాట్లు తదితర కార్యక్రమాలు చేపట్టామన్నారు.

ఈ పథకం కింద తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 1,240 ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ రకాల సదుపాయాలు కల్పించడం జరిగిందని, విడతల వారీగా ఎంపిక చేసిన అన్ని పాఠశాలలో పూర్తి స్థాయి సకల సదుపాయాలు కల్పించి కార్పొరేట్ కి ధీటుగా విద్యను అందిస్తామన్నారు.

మొదటి విడతలో రూ.3,497.62 కోట్లు వెచ్చించి, 9,123 స్కూళ్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, 12 అంశాలతో ప్రాతిపదికగా తీసుకుని స్కూళ్లను ఎంపిక చేశామన్నారు.

రానున్న రోజుల్లో జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క పాఠశాలలో పూర్తి స్థాయిలో అన్ని సౌకర్యాలతో ఉన్నత స్థాయిలో విద్యను ప్రతిఒక్కరికీ అందిస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed