ఆమె’… తల్లిగా లాలిస్తుంది, చెల్లిగా తోడుంటుంది… భార్యగా బాగోగులు చూస్తూ.. దాసిలా పనిచేస్తుంది. కుటుంబ భారాన్ని మోస్తూ… సర్వం త్యాగం చేస్తుంది. అంతటి గొప్ప మహిళకు మనసారా ధన్యవాదాలు
కనులు తెరిచిన క్షణం నుంచి.. బంధం కోసం బాధ్యత కోసం.. కుటుంబం కోసం.. అందర్నీ కనుపాపలా తలచి, ఆత్మీయత పంచి, తనవారి కోసం అహర్నిశలు కష్టించి, వారిని సహించి, వారి భవిష్యత్తు గురించి, తన ఇంటిని నందనవనం చేసే స్త్రీ మూర్తికి… పాదాభివందనం!! అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
స్త్రీ లేకపోతే జననం లేదు. స్త్రీ లేకపోతే గమనం లేదు. స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు. స్త్రీలేకపోతే అసలు సృష్టే లేదు’’.. కంటిపాపలా కాపాడే ‘స్త్రీమూర్తి’కి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
‘‘యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతా’’ – స్త్రీ ఎక్కడ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు ఉంటారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
కార్యేషు దాసి.. కరణేశు మంత్రి.. భోజ్యేసు మాత.. ఇలా సమస్తం నీవే. ఓ మాతృ మూర్తి.. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మీ కిదే మా వందనం!!
‘‘అమ్మను పూజించు.. భార్యను ప్రేమించు.. సోదరిని దీవించు.. ముఖ్యంగా మహిళలను గౌరవించు’’ – హ్యాపీ ఉమెన్స్ డే!
అన్నం కలిపి గోరు ముద్ద పెట్టేప్పుడు తన బిడ్డ ఉన్న ప్రేమ కూడా కలిపి పెడుతుంది. ఆ బిడ్డ ఎంతో ఇష్టంగా ఆ ముద్దలు తింటుంటే… ఆ బిడ్డ కడుపు నిండుతుందో లేదో కానీ, ఆ తల్లి కడుపు ఆనందంతో నిండిపోతుంది. అదీ.. అమ్మ ప్రేమంటే. స్త్రీమూర్తి గొప్పతనమంటే. హ్యపీ ఉమెన్స్ డే!
అమ్మంటే అంతులేని సొమ్మురా.. అది ఏనాటికి తరగని భాగ్యమురా. అమ్మ మనసున అమృతమే చూడరా.. అమ్మ ఒడిలో స్వర్గమే ఉందిరా. ఆమె విలువ తెలుసుకుని ప్రేమతో మసులుకోరా..
వనితామణులందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
Post navigation
Pratipada Vidyarthi vannatha chadu qawwaliప్రతి పేదవాడు ఉన్నత విద్యావంతుడు కావాలి.. ▪️సకల వసతులతో ప్రభుత్వ పాఠశాలలు.. ఉన్నత విలువలతో విద్యా ప్రమాణాలు.. ▪️ఇంగ్లీష్ మీడియంలో విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యం. ▪️మన బస్తి మన బడి కార్యక్రమంలో భాగంగా ఖమ్మం నగరంలో రూ.57.38 లక్షలతో అభివృద్ధి పనులు ప్రారంబించిన మంత్రి పువ్వాడ. పాఠశాలను రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం తీసుకొచ్చిన పథకం మన ఊరు-మన బడి/మన బస్తి-మన బడి అని అందులో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలలో అన్ని మౌళిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేయడం జరిగిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అన్నారు. మన బస్తి – మన బడి కార్యక్రమంలో భాగంగా ఖమ్మం నగరం 53వ డివిజన్ NSP క్యాంప్ లో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రూ. 57.38 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను మంత్రి పువ్వాడ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 26,065 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలో చదువుతోన్న విద్యార్థులకు నాణ్యమైన విద్య, నమోదు, హాజరుతో పాటు వారు తమ పాఠశాల విద్యను ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగించేందుకు వసతులు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి పేదవాడి ఉన్నత విద్యను ఉచితంగా అభ్యసించి జీవితంలో ఉన్నతంగా ఎదగాలని ప్రభుత్వం సంకల్పించిందని పేర్కొన్నారు. ఖమ్మం నగరంలో ఇంకా 16 ప్రభుత్వ పాఠశాలలో పనులు కొనసాగుతున్నాయని అతి త్వరలో వాటిని పూర్తి చేసి వినియోగంలోకి తెస్తామని హామి ఇచ్చారు. ఇప్పటికే నిర్దేశించిన పాఠశాలలు పూర్తి అయ్యాయని, అందులో విద్యార్థులు అద్భుతంగా విద్యను అందుకుంటున్నారని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తున్నారని, ఇంగ్లీష్ విద్యను అందించడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఇటీవలే కాలంలో ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ కొరకు తనకు విజ్ఞప్తులు పెరుగుతున్నాయని, ఆయా తల్లిదండ్రులు తమ పిల్లలకు పాఠశాలలో అడ్మిషన్ కోసం అడిగినపుడు మనసుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అని అన్నారు. దశల వారీగా డిజిటల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పెంచాలని ప్రభుత్వం భావిస్తోందని, దీనికోసమే మన ఊరు-మన బడి/మన బస్తి-మన బడి పథకాన్ని తీసుకొచ్చి అమలు చేస్తోందన్నారు. దశల వారీగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునీకరణ, స్కూళ్లలో 12 రకాల మౌలిక సదుపాయల కల్పనకు పటిష్ట చర్యలు చేపట్టామని, గ్రామీణ ప్రాంతాలలో ఈ స్కీమ్‌ను మన ఊరు-మన బడి పేరుతో అమలు చేస్తుండగా.. పట్టణ ప్రాంతాలలో మన బస్తి-మన బడి పేరుతో అమలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకే తెలంగాణ ప్రభుత్వం విద్యావ్యవస్థ పై అత్యధికంగా నిధులు వెచ్చించిందన్నారు. తొలుత ప్రభుత్వ, స్థానిక సంస్థలకు చెందిన పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని, ఆయా పాఠశాలలో నీటి సౌకర్యంతో పాటు టాయిలెట్లు, విద్యుద్దీకరణ, తాగునీటి సరఫరా, విద్యార్థులు, సిబ్బందికి సరిపడే ఫర్నీచర్ అందించడం, పాఠశాలలు మొత్తం నవీకరించడం, మరమ్మత్తులు చేయడం, కిచెన్లు ఏర్పాటు, శిథిలమైన గదుల స్థానంలో కొత్త క్లాస్ రూలు ఏర్పాటు చేయడం, డిజిటల్ విద్య వంటి వాటిని అమలు చేస్తోందన్నారు. జిల్లా కలెక్టర్ VP గౌతమ్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, మేయర్ పునుకొల్లు నీరజ, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, కార్పొరేటర్ పగడాల శ్రీవిద్యా నాగరాజ్, సుడా చైర్మన్ విజయ్, DEO సోమశేఖర్ శర్మ, RJC కృష్ణా తదితరులు ఉన్నారు.
ఆరోగ్య మహిళ.. ఆడ బిడ్డకు వరం.. ▪️మహిళా శ్రేయస్సే లక్ష్యంగా ప్రభుత్వం తెచ్చిన సరికొత్త పథకం. ▪️ఆరోగ్య మహిళలో ప్రతి మంగళవారం 57 రకాల ఉచిత పరీక్షలు. ▪️జిల్లా ఆసుపత్రిలో 65 పడకల ప్రత్యేక మహిళా వార్డు, రేడియాలజీ హబ్. ▪️ప్రారంబించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు. అరోగ్య మహిళ పథకం మహిళలకు వరంలాంటిదని, మహిళల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం మహిళా దినోత్సవం సందర్భంగా మరో గొప్ప వరాన్ని అందించిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ఆరోగ్య మహిళ అనే మంచి కార్యక్రమాన్ని రూపొందించిందని మంత్రి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో మహిళలa ఆరోగ్యంకై మెరుగైన పరీక్షల కోసం రేడియాలజీ యూనిట్, Mammogram ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆరోగ్య మహిళ కార్యక్రమంలో భాగంగా ప్రతి మంగళవారం మహిళలకు 57 రకాల పరీక్షలు ఉచితంగా చేసి మందులు ఉచితంగా ఇస్తారన్నారు. అవసరమైతే ఇతర దవాఖానలకు రెఫర్ చేస్తారన్నారు. పరీక్షల అనంతరం ఆరోగ్య మహిళ యాప్‌లో వివరాలు నమోదు చేసి ప్రతి పేషంట్‌కు తన ఆరోగ్య పరిస్థితి, వైద్యం వివరాలతో కూడిన కేస్ షీట్ అందజేసి పరీక్షలు పూర్తయ్యాక మెరుగైన వైద్యసేవలు అవసరమని భావిస్తే ఇతర దవాఖానలకు రిఫర్ చేస్ అవకాశం ఉందన్నారు. అక్కడ వారికి మెరుగైన వైద్య సాయం అందిస్తారన్నారు. మెరుగైన సేవలతో విశేష ఆదరణ ప్రభుత్వ దవాఖానలు సరికొత్తగా మారాయని, స్వరాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్‌కు దీటుగా వసతులు కల్పించింది. మెరుగైన వైద్యసేవలు అందిస్తుండడం, నాణ్యమైన మందులు అందిస్తుండడంతోనే ప్రజాదరణ పెరుగుతున్నదన్నారు. అనతికాలంలోనే రోగుల సంఖ్య రెట్టింపయిందని, ఈ క్రమంలోనే అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. DM &HO మాలతి మాట్లాడుతూ.. అరోగ్య మహిళలో వీటిలో 57 రకాల పరీక్షలు ఉచితం మహిళలు ప్రధానంగా ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించిందని, ఆయా రుగ్మతలను గుర్తించేందుకు ప్రతి మంగళవారం వైద్యపరీక్షలు నిర్వహించడానికి కసరత్తు చేస్తుందని, దీని కోసమే ‘ఆరోగ్య మహిళ’అనే పథకాన్ని ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. ఇందులో 57 రకాల పరీక్షలు ఉచితంగా చేసి, మందులు, అవసరమైన వారికి చికిత్స కూడా చేయనున్నామని, ప్రధానంగా డయాగ్నోస్టిక్స్, సూక్ష్మపోషక లోపాలు, పీసీవోఎస్, కుటుంబనియంత్రణ, రుతు సమస్యలు, లైంగిక వ్యాధులు, క్యాన్సర్ స్క్రీనింగ్, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, మెనోపాజ్ నిర్వహణ, శరీర బరువుకు సంబంధించిన పరీక్షలు చేసి 24 గంటల్లోనే రిపోర్ట్లు అందిస్తారన్నారు. మహిళలకు షుగర్, బీపీ, రక్తహీనత వంటి వాటికి సాధారణ పరీక్షలతో పాటు లక్షణాల మేరకు పలు రకాల వైద్యపరీక్షలు నిర్వహించి ఇంకా వెయిట్ మేనేజ్మెంట్, సెక్స్‌వల్ ట్రాన్స్మిటెడ్ మే నేజ్మెంట్, ఇన్ఫర్టిలిటీ మేనేజ్మెంట్, మోనోపాజ్, థైరా యిడ్, విటమిన్‌డీ-3, ఈ-12 డెఫిసియన్సి వంటి వాటికి దవాఖానల్లో స్క్రీనింగ్ చేస్తారన్నారు. దాంతో పాటు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, పెల్విక్ ఇన్ప్లమేటరీ వ్యాధులకు కూడా పరీక్షలు చేయనున్నారని, అసవరమైన వారిని రెఫరల్ ఆసుపత్రులకు సిఫార్సు చేస్తారని, హర్మోన్ రీప్లేస్మెంట్, థెరపీ మెడికేషన్, కౌన్సెలింగ్ ఇస్తారు. బరువుకు సంబంధించి యోగ, వ్యాయామంపై అవగాహన కల్పిస్తారన్నారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగించుకోవాలన్నారు.