సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో మంగళ, బుధవారాల్లో సత్తుపల్లి పట్టణంలో నిర్వహించిన భారీ వాహనాల ర్యాలీ ఉత్సాహంగా సాగింది.

వేంసూరు మండలం, కందుకూరు వేదిక సాగిన జాతీయ ఎండ్ల బండలాగుడు, పురుషుల కబడ్డీ పోటీల సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖమంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

వారితో పాటు రాజ్యసభ సభ్యులు డాక్టర్ బండి పార్ధసారధిరెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్రాజు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, గ్రంధాలయ సంస్థ జిల్లా అధ్యక్షుడు కొత్తూరు ఉమామహేశ్వరరావులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి భారీగా కార్లతో వాహనాల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంతో బీఆర్ఎస్ పార్టీలో నూతనోత్సాహం నిండినట్లయింది.

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని ప్రజల వద్దకు తీసుకెళుతూ.. నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమం కోసం అహర్నిసలు శ్రమిస్తున్న సండ్ర వెంకటవీరయ్య మళ్లీ ఎమ్మెల్యేగా రావాలని ప్రజలతో పాటు కందుకూరు వేదికగా సాగిన సభలో రాష్ట్రమంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed