ఆల్ ఇండియా బైతుల్ ఇమ్దాద్ ఆధ్వర్యంలో రంజాన్ కిట్టు పంపిణీ
ముఖ్య అతిథి ఏసిపి పి.వి.గణేష్
ఖమ్మం నగరంలోని కాల్వొడ్డు మదర్స -ఎ- ఇస్లామియా దారుల్ ఉలూమ్ లో ఆల్ ఇండియా బైతుల్ ఇమ్దాద్ ఆధ్వర్యంలో రంజాన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో పేద ముస్లింలకు ఉపవాసాలు ఉండే సమయంలో ఉపవాస దీక్షలకు ఆర్ధిక ఇబ్బందులు తలెత్తకుండా నెలకు సరిపడ సరుకులు , బియ్యం పంపిణీ చేసారు . ఈ కార్యక్రమానికి నగర ఏసిపి పి.వి. గణేష్ ముఖ్య అతిథిగా పాల్గొని నిత్యవసర సరుకులు పేద ముస్లింలకు అందజేసారు . సంస్థ నిర్వహకులు ఫ్రీ అంబులెన్స్ , ఫ్రీ నిత్యావసరాలు , చదువుకు , పెళ్లికి ఇలా సమాజంలో ఉన్న వారికి అన్ని విధాల తోడ్పాటునివ్వడాన్ని చూసి చాలా సంతోషంగా ఉందన్నారు . పండుగ అంటే అందరు జరుపుకొనేదని అందరి కోసం కొందరు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది సమాజానికి మంచి సందేశం ఇస్తుందన్నారు . సుమారుగా నిరుపేద ముస్లింలకు వంద మందికి అందజేశారు . ఈ కార్యక్రమంలో అభయ హస్పిటల్ సిఈఓ కరీం , మౌలానా సాదతుల్లాహ్ , ఎండి. మునవ్వర్ (సేఫ్ బాగ్స్ ) , హాఫిజ్ ఫజల్ , హాఫిజ్ నజీర్ , ముఫ్టీ మహబూబ్ అలీ , ముఫ్టీ సల్మాన్ ఖాన్ ఖాదర్ తదితరులు పాల్గొన్నారు .

ByVNB News

Mar 19, 2023

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed