రేపు జిల్లాల్లో సీఎం పర్యటన.. పంటలను పరిశీలించనున్న కేసీఆర్
ఖమ్మం జిల్లాకు సీఎం రాక
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్నారు. ఇటీవల రాష్ట్రంలో కురిసిన వర్షాలకు భారీగా పంట నష్టం జరిగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కరీంనగర్, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో భారీగా పంట నష్టం జరిగింది. ఈ మేరకు ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను ఆదేశించింది. రైతులెవరూ నష్టపోకుండా అంచనాలను నివేదికను సిద్ధం చేయాలని సూచించింది. మరో వైపు ఇప్పటికే మంత్రులు సైతం ఆయా జిల్లాల్లో పంట నష్టాన్ని పరిశీలించారు.

