కౌలు రైతుల్ని ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ ఖమ్మం జిల్లా పార్లమెంటు అధ్యక్షుడు కూరపాటి వెంకటేశ్వర్లు డిమాండ్
ఇటీవల అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతుల పంట పొలాలను తెలుగుదేశం పార్టీ పోరాట ఫలితమే ఈరోజు ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చి నష్టపోయిన పంటలను పరిశీలించడం జరిగింది అని తెలుగుదేశం పార్టీ ఖమ్మం పార్లమెంట్ అబ్జర్వర్ కూరపాటి వెంకటేశ్వర్లు అన్నారు నష్టపోయిన రైతులకు ఎకరానికి 10000 రూపాయలు మాత్రమే ప్రకటించడం బాధాకరమైన విషయమన్నారు కౌలు రైతులు ఎకరానికి 20000 రూపాయలు, పంట పెట్టుబడి కి 30 వేల రూపాయలు , మొత్తం ఎకరానికి 50000 రూపాయలు ఖర్చుపెట్టి పంట పూర్తిగా నష్టపోయిన సందర్భంగా ప్రతి రైతుకు ఎకరానికి 30 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని పూర్తి స్థాయిలో రైతు రుణ మాఫీ చేయాలని సబ్సిడీపై రైతులకు వెంటనే విత్తనాలు ఎరువులు పంపిణీ చేయాలని కూరపాటి వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు డిమాండ్ చేశారు

