


పెద్దమ్మతల్లిని దర్శించుకున్న ఎంపీ రవిచంద్ర, విజయలక్ష్మీ దంపతులు
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, విజయలక్ష్మీ పుణ్య దంపతులు పాల్వంచ పెద్దమ్మతల్లిని దర్శించుకున్నారు.భద్రాద్రి శ్రీసీతారామ చంద్రస్వామి వారి కళ్యాణ బ్రహ్మోత్సవంలో పాల్గొని తిరిగి ఖమ్మం వస్తూ మార్గమధ్యంలో పాల్వంచ జగన్నాథపురంలో కొలువైన పెద్దమ్మతల్లిని రవిచంద్ర, విజయలక్ష్మీ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారిణి రజనీకుమారి ఎంపీ రవిచంద్ర, విజయలక్ష్మీ,వారి కుమారులు నిఖిల్ బాబు, నాగరాజు బాబులకు ఆత్మీయ స్వాగతం పలికి కండువాలతో సత్కరించారు
