







గోళ్లపాడు ఛానెల్ ఆధునీకరణతో త్రీ టౌన్ కు మహర్దశ..
▪️నా పుట్టినరోజు న ఒక మంచి పని చేయలని తలచి ఐదేళ్ల క్రితం గోళ్ళపాడు మురుగును తొలగించే పని ప్రారంభం.
▪️రజబ్ అలీ పార్క్, వీధి వ్యాపారుల సముదాయం ప్రారంభం..
▪️మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు.
ఖమ్మం నగరంలోని 46వ డివిజన్ జూబిలీపురలో గోళ్ళపాడు ఛానల్ పై ఎర్పాటు చేసిన మొహమ్మద్ రజబ్ అలీ పార్క్, రూ.1.86కోట్లతో ఎర్పాటు చేసిన వీధి వ్యాపారుల సముదాయంను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఖమ్మం నగరంలో సుదీర్ఘకాలంగా మురుగుతో పేరుకుపోయిన గోళ్లపాడ్ ఛానల్ కాలువలో మురుగు నామ రూపాల్లేకుండా చేసి సుమారు రూ.200 కోట్ల విలువైన స్థలాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఅర్ గారు, పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ గారి సహకారంతో కాలువపై ఉన్న ఆక్రమణలను తొలగించి, కాలువ అంతర్భాగంలో మురుగు, వర్షపు నీరు పారడానికి పైపులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఎన్నో సంవత్పరాల నుంచి 10.6 కిలోమీటర్లు పొడవునా ఉన్న కాలువ ఆక్రమణలు, సిల్ట్‌తో కుచించిపోయిందని అలాంటి కాలువను పూర్తిగా మార్చగలిగామన్నారు. కాలువపైభాగాన దాదాపు పది పార్కులు, క్రీడాప్రాంగణాలు, బస్తీదవాఖానలు, పట్టణ ప్రకృతి వనాలు, తెలంగాణ క్రీడాప్రాంగణాలు, వాకింగ్ ట్రాక్‌లు సుందరంగా ప్రజల సౌకర్యార్థం నిర్మించామన్నారు.
ఈ కాలువ పొడవునా సుమారు 32 ఎకరాల స్థలాన్ని సృష్టించామని, నగరాల్లో ఇంత పెద్దమొత్తంలో స్థలం అందుబాటులో ఉందని, విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ వల్లే ఇది సాధ్యమైందన్నారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.100 కోట్లు ఖర్చు చేస్తే రూ.200 కోట్లకు పైగా ఆస్తి ప్రజలకు అందుబాటులోకి వచ్చిందన్నారు. ఇక్కడి నుంచి తరలించినవారికి వెలుగుమట్ల వద్ద స్థలాలు ఇచ్చామని ప్రస్తుతం ఆ ప్రాంతంలో భూముల ధరలు పెరగడంతో వారంతా లక్షాదికారులు అయి సంతోషంగా ఉన్నారన్నారు.
ఛానల్ పై అండర్‌గ్రౌండ్ డ్రైనేజీని నిర్మించి నగరంలో దాదాపు 23 డివిజన్లకు సంబంధించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పూర్తి చేసి పై భాగంలో ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే సుందరమైన పార్కులు, ఆరోగ్యాన్ని పంచే ఓపెన్ జిమ్ లు, ఆట స్థలాలు, క్రీడా ప్రాంగణాలు ఎర్పాటు చేయడం జరిగిందన్నారు.
సరిగ్గా ఐదేళ్ల క్రితం నా పుట్టినరోజు నాడు ఇదే మోతే నగర్ నందు గోళ్ళపాడు ఛానల్ మురుగులో దిగి దాన్ని తొలగించే పనిని ప్రారంభించామని, నేటికీ ఐదేళ్లకి నా కల తీరిందని స్పష్టం చేశారు.
నిర్విరామంగా చేసిన అభివృద్ధి ఫలితమే నేడు మనం అనుభవిస్తున్నమని, ఇది కేవలం పేద ప్రజల కోసమే చేశానని పేర్కొన్నారు.
ఖమ్మం త్రీ టౌన్ నందు ప్రతిష్టాత్మంగా మున్నేరు పై కేబుల్ బ్రిడ్జి ను నిర్మించనున్నట్లు వెల్లడించారు. లాకారం కంటే అద్భుతంగా ఉండనుంది అని అన్నారు.
గతంలో గాంధీ చౌక్ ఎలా ఉంది నేడు ఎలా ఉంది.. నగరాభివృద్ధి కోసం ఎక్కడా రాజీ పడలేదు, ఎక్కడ రానన్ని నిధులు వందల కోట్ల రూపాయలు తేగలిగామని అన్నారు.
ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా తొలిసారి ఎమ్మేల్యేగా ఎన్నికైన నాటి నుండి దాదాపు 40వేల నల్లా కనెక్షన్స్ ఇచ్చామని, అదనంగా మరో 16వేల నల్లా కనెక్షన్స్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ VP గౌతమ్ గారు, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి గారి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ఆయా పనులు పర్యవేక్షిస్తూ అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేసి అధికారులను మంత్రి పువ్వాడ అభినందించారు.
మేయర్ పునుకొల్లు నీరజ, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, AMC చైర్మన్ శ్వేత, కార్పొరేటర్లు కన్నం వైష్ణవి, BG క్లెమెంట్, ముక్కాల కమల, సరస్వతి, ఎల్లంపల్లి వెంకటేశ్వర్లు, చామకురి వెంకన్న, పబ్లిక్ హెల్త్ EE రంజిత్, మున్సిపల్ EE కృష్ణలాల్, DE రంగారావు, MEMPA DMC సుజాత, సీపీఐ నాయకులు మౌలానా BRS నాయకులు RJC కృష్ణ, తోట రామారావు, మాటేటి నాగేశ్వరరావు గారు, పగడాల నాగరాజు, ప్రసన్న కృష్ణ, రవి నాయక్, కొత్తా వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.
