జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పంపిణీకి క్యాబినేట్ ఆమోదం..

▪️మాట నిలుపుకున్న మంత్రి పువ్వాడ..

▪️ఇరిగేషన్ స్థలం మొత్తం 23 ఎకరాల్లో జర్నలిస్ట్ లకు ఇళ్ళ స్థలాలు..

పొలిటికల్ పవర్ న్యూస్ 9 ఖమ్మం ప్రతినిధి వెంపటి నాయుడు

▪️అతి త్వరలో పంపిణీ చేస్తామన్న మంత్రి పువ్వాడ..

ఖమ్మం జిల్లా కేంద్రంలోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడానికి రాష్ట్ర క్యాబినేట్ ఆమోదం తెలిపింది.

అర్హులైన జర్నలిస్ట్ లందరికీ ఇళ్ళ స్థలాలు ఇస్తామన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన మాట నిలుపుకున్నారు.

ఇప్పటికే ఖమ్మం నగర జర్నలిస్ట్ లకు ఇళ్ళ పట్టాలు ఇస్తామని
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఅర్ గారి హామీ మేరకు 5ఎకరాల్లో జర్నలిస్ట్ లకు ఇంటి స్థలం ఇవ్వాలని ప్రభుత్వం ప్రత్యేక Go జారీ చేసింది.

5 ఎకరాలు స్థలం సరిపోదని, అర్హులైన జర్నలిస్ట్ లందరికీ ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఅర్ గారిని కోరిన స్థానిక ఎమ్మెల్యే, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి విజ్ఞప్తి మేరకు నేడు హైద్రాబాద్ లో జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఅర్ గారు ఆమోదం తెలిపారు.

ఇప్పటికే స్థలం గుర్తించామని, ప్రతి జర్నలిస్టుకూ 200 గజాలు ఇవ్వనున్నామని తెలిపారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో పని చేసే జర్నలిస్టులందరికీ ఇళ్ళ స్థలాలు పంపిణీ చేస్తామన్నారు.

మంత్రి కి టియుడబ్ల్యూజే ఐజెయు కృతజ్ఞతలు

జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు అప్పగించాలని గత ఏడాది నుంచి నిరంతరం కృషి చేస్తున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ కి
టి యు డబ్ల్యూ జే (ఐజేయు) జిల్లా కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది

ఈ క్రెడిట్ అంతా రాష్ట్రమంత్రి పువ్వాడ అజయ్ గారికి దక్కుతుందని జిల్లా జిల్లా కమిటీ అభిప్రాయపడుతూ మంత్రిగా మంత్రిగారికి జర్నలిస్టుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed