ప్రజల భద్రతే ప్రభుత్వ లక్ష్యం..
▪️కేసీఅర్ గారు చేపట్టిన అనేక సంస్కరణ వల్లే శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి.
నేడు దేశంలోనే తెలంగాణ అత్యంత భద్రత గల రాష్ట్ర.
▪️ఖమ్మంను కమిషనరేట్ గా చేకుకోడం వల్ల జిల్లాలో పౌరుల భద్రత మరింత పెరిగింది.
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో సురక్ష దినోత్సవం సందర్భంగా ర్యాలీలో మాట్లాడిన మంత్రి పువ్వాడ.
*పొలిటికల్ పవర్ న్యూస్ 9 ఖమ్మం ప్రతినిధి వెంపటి నాయుడు *
:రాష్ట్రంలో శాంతి భద్రతల పర్యవేక్షణకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నదని, ప్రజల భద్రతే ప్రధాన కర్తవ్యం గా పోలీస్ వ్యవస్థ నిర్విరామంగా పని చేస్తున్నదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోలీస్ శాఖ, జిల్లా పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్.వారియర్ అధ్వర్యంలో చేపట్టిన సురక్ష దినోత్సవం కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం ఉదయం ఖమ్మం జిల్లా కేంద్రంలోని యస్ ఆర్ అండ్ బి జి యన్ ఆర్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్ నుండి చేపట్టిన పోలీసుల వాహనల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు, ఎంపి లు నామా నాగేశ్వర రావు గారు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు గారు జెండా ఊపి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో వన్ టౌన్, టూ టౌన్, త్రీ టౌన్, మహిళా పోలీస్ స్టేషన్,సి సి యస్, కమిసన్రేట్ పరిధిలోని సర్కిల్ ఇన్సు ఫెక్టర్స్, సబ్ ఇన్సు ఫెక్టర్స్, అధికారులు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..
