




Khammam/VNB TV NEWS/20.06.2023/STAFF REPORTER VEMPATTI NAIDU
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు భాగంగా నేడు విద్యా దినోత్సవం సందర్భంగా ఖమ్మం NSP క్యాంపులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రూ.45.06 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ది పనులను ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు..
అనంతరం DPRC భవనంలో జరిగిన విద్యా సంబరాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉత్తమ విద్యార్థులను మంత్రి అభినందనలు తెలిపి సత్కరించారు. జిల్లా వ్యాప్తంగా ఇటీవలే 10వ తరగతిలో వంద శాతం పాస్ అయిన ఉపాధ్యాయులను సబ్జెక్ట్స్ వారీగా ప్రశంసా పత్రాలు, మెమెంటో లు అందజేశారు.
ఇదే ఒరవడి ప్రతి ఏడాది కొనసాగించాలని మంత్రి సూచించారు. రానున్న సంవత్సరంలో మరింత ఉత్తీర్ణత శాతం పెరిగే విధంగా ఉపాద్యాయులు కృషి చేయాలన్నారు.
