ఉచిత మెడికల్ క్యాంప్ ను ప్రారంభించిన డాక్టర్ కూరపాటి ప్రదీప్ .

వి ఎన్ బి న్యూస్ డిస్టిక్ స్టాప్ రిపోర్టర్ వెంపటి నాయుడు

ఖమ్మం నెహ్రూ నగర్ లో ఆదివారం ప్రైవేట్ ఎలక్ట్రిషియన్ యూనియన్ ఆధ్వర్యంలో శ్రీ అభయ హాస్పిటల్ వారి సహకారంతో ఏర్పాటుచేసిన ఉచిత మెడికల్ క్యాంప్ కు ముఖ్యఅతిథిగా వచ్చిన ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ ప్రారంభించి మాట్లాడారు . ప్రతి మనిషికి ఆరోగ్యం అతి ముఖ్యమని తమ తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ జీవనశాలిని కొనసాగించాలని ఇంటిని పోషించేవారు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆ కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుందన్నారు . తను సంపూర్ణఆరోగ్యంగా ఉన్నప్పుడే తమ కుటుంబాన్ని పోషించుకునే స్టేమినా ఉంటుందన్నారు . వర్షాకాల నేపాథ్యంలో సీజనల్ వ్యాధులు విజృంభించే అవకాశం ఉందని కావున సీజనల్ వ్యాధుల పై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు . ఈ రోజు జరిగిన ఉచిత క్యాంప్ లో బీపీ , షుగర్ , జ్వరం , జలుబు , కీళ్ల నొప్పులు , థైరాయిడ్ వంటి వ్యాధులకు టెస్టులు చేసి అవసరం ఉన్నవారికి ఉచితంగా మందులు అందజేశారు . చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఉపయోగించుకున్నారు . ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథుధిగా వచ్చిన నగర గ్రంధాలయ చైర్మన్ ఎండి ఆశ్రిఫ్ ను శాలవాతో సత్కరించారు . ఈ శిబిరంలో శ్రీ అభయ హాస్పిటల్ డాక్టర్లు డా.అహ్మద్ ఖాన్ (MD General medicine ) , డా.ఫణి తేజ (MS ORTHO ), డా.మహబూబ్ బాషా ( MS SURGEON ), డా.బ్రహ్మ కుమార్ ( MD Paediatric ) వీరితో పాటు ప్రైవేట్ ఎలక్ట్రిషియన్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ధర్నా సి బాలరాజు , నగర అధ్యక్షులు ఎస్.కె హషిమ్ షరీఫ్ , గిరిబాబు , లింగమూర్తి , ఆర్కే చారి , రాజేష్ , ఫరీద్ , కావేరి నాగేశ్వరరావు , షకీల్ , రాము ఇంకా నగర ఎలక్ట్రిషన్ తదితరులు ఉన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed