Date 25/06/2023
మున్నూరుకాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు తథ్యం:ఎంపీ రవిచంద్ర
మున్నూరుకాపు ప్రజాప్రతినిధులం ముఖ్యమంత్రి కేసీఆర్ ను త్వరలో కలుస్తం:ఎంపీ రవిచంద్ర
కేసీఆర్ మున్నూరుకాపులకు సముచిత గౌరవం ఇచ్చారు, ఇస్తున్నారు:ఎంపీ రవిచంద్ర
మున్నూరుకాపు సంఘం 33జిల్లా శాఖల అధ్యక్షులతో కొండా దేవయ్య ఆధ్వర్యంలో రవిచంద్ర నివాసంలో ఆదివారం సమావేశం జరిగింది
ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు మున్నూరుకాపులకు సముచిత గౌరవం ఇచ్చారని,ఇస్తున్నారని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు.గతంతో పోల్చిన పక్షంలో కేసీఆర్ ప్రభుత్వంలో మున్నూరుకాపులకు గౌరవప్రదమైన పదవులు లభించాయని, ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు కూడా తథ్యమన్నారు.మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవయ్య ఆధ్వర్యంలో ఆదివారం బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఎంపీ రవిచంద్ర నివాసంలో సంఘం 33జిల్లా శాఖల అధ్యక్షుల సమావేశం జరిగింది.సంఘం గౌరవాధ్యక్షులైన ఎంపీ రవిచంద్ర ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటుకు కేసీఆర్ గతంలోనే సానుకూలంగా స్పందించారన్నారు. తాను,మంత్రి గంగుల కమలాకర్,ఎంపీ కేశవరావుల ఆధ్వర్యంలో మున్నూరుకాపు ప్రజాప్రతినిధులను వెంట తీసుకుని కేసీఆర్ ను త్వరలో కలుస్తామని తెలిపారు.కార్పోరేషన్ ఏర్పాటుతో పాటు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించాల్సిందిగా, మున్నూరుకాపు ప్రముఖులు పలువురికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తామని ఎంపీ రవిచంద్ర వివరించారు.
కొండా దేవయ్య అధ్యక్షోపన్యాసం
ఓకే కులం-ఓకే సంఘం గొడుగు కింద మనమందరం ఏకతాటిపై నడుద్దామన్నారు.ఐకమత్యమే బలమని, మరింత సంఘటితంగా ముందుకు సాగడం ద్వారా న్యాయమైన మన హక్కుల్ని సాధించుకుందామని చెప్పారు.మున్నూరుకాపుల సర్వతోముఖాభివృద్ధికి గాను ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతూ ఇటీవల తహశీల్దార్స్,కలెక్టర్స్ వినతిపత్రాలు అందజేసే కార్యక్రమం విజయవంతమైందన్నారు.ఈ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే సానుకూల ప్రకటన చేస్తారని ఆశాభావంతో మున్నూరుకాపులు ఎదురుచూస్తున్నారన్నారు.సానుకూల ప్రకటన రానట్టయితే ముఖ్యమంత్రికి పెద్ద ఎత్తున ఉత్తరాల ద్వారా విజ్జప్తి చేస్తామని వివరించారు.ఈ సమావేశంలో సంఘం ప్రముఖులు చల్లా హరిశంకర్,మరికల్ పోత సుధీర్ కుమార్,ఆకుల గాంధీ,పారా నాగేశ్వరరావు,ఊసా రఘు, వద్దిరాజు దేవేందర్, జిల్లా శాఖల అధ్యక్షులు వాసుదేవుల వెంకటనర్సయ్య,బాదినేని రాజేందర్,ఆర్వీ మహేందర్,ప్రకాష్ రావు, నాయకులు జెన్నాయికోడే జగన్మోహన్, హరీష్,వాసాల వెంకటేష్,మురళి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు, కొండా దేవయ్యలు సంఘం జిల్లా శాఖల అధ్యక్షులను శాలువాలతో సత్కరించారు.

