VNB TV NEWS kmm








SUDA నిధులు రూ.60 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి పువ్వాడ..
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్ లలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ప్రారంభించారు.
SUDA నిధులు మొత్తం రూ. 60 లక్షలతో VDF టెక్నాలజీతో నిర్మించిన CC రోడ్స్ ను వారు ప్రారంభించారు.
ఖమ్మం నగరంలోని 25వ డివిజన్ అద్దంకి వారి వీధి వద్ద రూ.20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్ ను మంత్రి పువ్వాడ అజయ్ గారు ప్రారంభించారు.
నగరంలోని 29వ డివిజన్ ప్రకాశ్ నగర్ FCI గోడౌన్ వద్ద రూ.20 లక్షలతో నిర్మించిన రెండు సీసీ రోడ్స్ ను మంత్రి ప్రారంభించారు.
నగరంలోని 36వ డివిజన్ గాంధీ చౌక్ డబ్బాలబజార్ వద్ద రూ.20లక్షలతో నిర్మించిన సీసీ రోడ్స్ ను మంత్రి పువ్వాడ ప్రారంభించారు.
