


ఆర్ధిక సంస్కరణల జాతిపిత పీవీ.. మంత్రి పువ్వాడ.
దేశం క్లిష్ట పరిస్థితులలో ఉన్న సందర్భాల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని ఆర్ధిక ఇబ్బందుల నుండి గట్టెక్కిచ్చిన గొప్ప నాయకుడు మాజీ ప్రధాన మంత్రి PV నరసింహ రావు గారు అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అన్నారు.
నేడు పీవీ 102 వ జయంతి సందర్భంగా ఖమ్మం నగరం లకారం సర్కిల్ నందు గల PV గారి విగ్రహానికి మంత్రి పువ్వాడ, జిల్లా కలెక్టర్ VP గౌతమ్ లు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
