












VNB TV NEWS kmm vempatti Naidu staff reporter bcm
➡️ మీతోనే మేమున్నాం.. భయం వద్దు : వరద బాధితులకు ఎంపీ నామ భరోసా
➡️ భద్రాచలం గోదావరి వరద ప్రాంతాల్లో ఎంపీ నామ నేతృత్వంలో ఎంపీల విస్తృత పర్యటన
➡️ పునరావాస కేంద్రాల సందర్శన – వరద బాధితులకు పరామర్శ
➡️ భద్రాచలం కరకట్ట వద్ద గోదావరి వరద పరిశీలన
➡️ కేసీఆర్ అండగా ఉన్నారు : ఎంపీ నామ నాగేశ్వరరావు
➡️➡️ మీతోనే మేమున్నామని, భయపడవద్దని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు గోదావరి వరద బాధితులకు అభయం ఇచ్చి , భరోసా కల్పించారు. శనివారం మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర,, ఎమ్మెల్సీ, పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు తాతా మధుసూదన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు , పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు తో కలసి శనివారం ఎంపీ నామ నేతృత్వంలో భద్రాచలం గోదావరి వరద ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ లోను, భద్రాచలం పబ్లిక్ స్కూల్ లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను సందర్శించి, వరద బాధితులను స్వయంగా కలుసుకొని, మాట్లాడి, వారి బాధలను అడిగి తెలుసుకుని, పరామర్శించారు. అనంతరం బూర్గంపాడు ను చుట్టుముట్టిన గోదావరి వరద నీటిలో నడిచి వెళ్లి, వరద పరిస్థితిని అంచనా వేశారు.గ్రామస్తులు తోను, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు బూర్గంపాడు వద్ద ఉత్తరం, తూర్పు వైపు చుట్టుముట్టిన వరద నీటిలో నడిచి వెళ్లి, వరద తీవ్రతను సందర్శించారు. తర్వాత మంత్రి అజయ్ కుమార్ తో కలసి భద్రాచలం కరకట్ట ఎక్కి, గోదావరి వరద తీవ్రతను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ వరద బాధితులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు యుద్ధప్రాతిపదికన తీసుకుందని , భయపడాల్సిన అవసరం లేదన్నారు. పోలీస్, రెవెన్యూ, అధికార యంత్రాంగం సర్వం సిద్ధమై సేవలందిస్తుందని , అప్రమత్తంగా ఉంటూ అత్యవసర పరిస్థితుల్లో పునరావాస కేంద్రాల్లో షెల్టర్ తీసుకోTవాలన్నారు. పునరావాస కేంద్రాల్లో ఆహారం, మంచినీరు వంటి కనీస సదుపాయలుండేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు పరిస్థితి ని సమీక్షిస్తూ అధికారులను, ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారని, సీఎం ఆదేశాల మేరకు ప్రజా ప్రతినిధులు ప్రజలతోనే ఉంటూ వారి కష్టాల్లో పాలుపంచు కుంటూ , ధైర్యం చెబుతు న్నారని అన్నారు. ఈ కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఖమ్మం జిల్లా రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వర రావు, చిత్తారు సింహాద్రి యాదవ్, గొడ్డేటి మాధవరావు, మోరంపూడి ప్రసాద్, నామ సేవా సమితి నాయకులు పాల్వంచ రాజేష్, చీకటి రాంబాబు, రేగళ్ల కృష్ణ ప్రసాద్, మునిగంటి భార్గవ్, తదితరులు పాల్గొన్నారు.
