




Khammam/11.08.20 23 తేజ వార్త జాతీయ దినపత్రిక జిల్లా స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు
వెజ్ అండ్ నాన్ మార్కెట్ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి పువ్వాడ.
▪️పనుల ఆలస్యం పట్ల ఆగ్రహం..
▪️త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశం.
ఖమ్మం నగర ప్రజల సౌకర్యార్థం కూరగాయలు, పండ్లు, మాంసాహారం, చేపలు తదితరుల నిత్యావసర వస్తువులు అన్ని ఒకే చోట అందుబాటులో ఉండాలన్న సంకల్పంతో ఖనాపురం ప్రధాన రహదారి పక్కన నిర్మిస్తున్న సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ఆకస్మికంగా పరిశీలించారు.
ఖమ్మం నగరంలోని ఖానాపురంలో 2 ఎకరాల సువిశాల స్థలంలో రూ.4.50కోట్లతో నిర్మిస్తున్న సమీకృత వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ నిర్మాణ పనులు ఆగిపోవడం పట్ల మంత్రి అసహనం వ్యక్తం చేశారు.
శుక్రవారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు మేయర్ పునుకొల్లు నీరజ గారితో కలిసి పరిశీలించారు.
ఇప్పటికే ఆయా పనులు దాదాపు పూర్తి కావాల్సి ఉండగా ఇంకా అసంపూర్తిగా ఉంటడం ఏంటని, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణమే పనులు ప్రారంభం కావాలని ఆదేశించారు.
ప్రజల కోసం సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ లో 65 వెజ్ స్టాల్స్, 23ఫ్రూట్ స్టాల్స్, 46నాన్-వెజ్ స్టాల్స్ మొత్తం-134 స్టాల్స్ తో అన్ని సౌకర్యాలు ఒకే చోట ప్రజలకు కావలసినవి అందుబాటులో ఉండనున్నాయి.
మేయర్ పునుకొల్లు నీరజ, కార్పొరేటర్లు నాగండ్ల కోటి, దండా జ్యోతి రెడ్డి, BRS నగర పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజు తదితరులు ఉన్నారు.
