

















Khammam/15.08.2023
VNB TV NEWS kmm VEMPATTI NAIDU
స్వాతంత్ర దినోత్సవ వేడుకలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి కామెంట్స్..
స్వాతంత్ర పోరాటంలో మన జిల్లాకు విశిష్ట స్థానం ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది, సంక్షేమ పథకాలలో ఖమ్మం జిల్లా అగ్రగామిగా నిలుస్తుంది.
ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యాధి నిర్దారణకు గాను రెండు కోట్ల 15 లక్షల రూపాయిలతో సి.టి స్కాన్ ను అందుబాటులోకి తెచ్చాము.
జిల్లాలో 161 పల్లె దవాఖానాలు, 09 బస్తీ దవాఖానాలు ప్రారంభించాము.
బనిగండ్లపాడు ఆరోగ్య కేంద్రానికి కోటి 56 లక్షలు మంజూరు చేశాము.
జిల్లాలో 115 పాఠశాలలకు ప్రతి పాఠశాలకు 9 లక్షల ఖర్చుతో 8,9,10 తరగతులకు డిజిటల్ తరగతి గదులు ఏర్పాటు చేశాము.
అర్హులైన వారందరికీ ప్రతి నెలా 15 వందల మందికి బి.సి బందు అందజేస్తున్నము.
రాష్ట్రంలో మొట్టమొదటి సోలార్ కలెక్టరేట్ భవనం ఎర్పాటు చేశాం.
ఖమ్మం – సూర్యాపేట రహదారి 15 వందల 66 కోట్లతో 58.62 కిలోమీటర్లు రోడ్డు నిర్మాణం పూర్తి చేశాము.
చింతకాని మండలంలో 3462 మంది లబ్దిదారులకు దళితబందు మంజూరు చేశాము.
2015 నుండి ఇప్పటి వరకు 8956 డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు చేశాము.
వంద కోట్లతో గోళ్ళపాడు ఛానల్ ను ఆధునీకరించాము.
4కోట్ల 50 లక్షలతో ఇల్లందు క్రాస్ రోడ్డు లో ఆధునిక మార్కెట్ ను అందుబాటులోకి తెచ్చాము.
జి.ఓ 58, 59 ప్రకారం ప్రభుత్వ స్థలాల్లో ఉన్న ఇండ్లను క్రమబద్దికరుస్తున్నాము.
