Khammam/28.09.2023

తేజ వార్త దినపత్రిక తెలంగాణ ఖమ్మం సిటీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గృహలక్ష్మీ పథకం ద్వారా మంజూరు ఉత్తర్వుల పత్రాలను భక్తరామదాసు కళాక్షేత్రంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు లబ్దిదారులకు స్వయంగా పంపిణి చేశారు.

ఖమ్మం నగరంలోని 17, 18, 24, 42, 43, 46, 49, 50, 52, 53, 55, 56 డివిజన్లలో మంజూరైన గృహలక్ష్మి పథకం మంజూరు పత్రాలను మంత్రి పువ్వాడ అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. పేదల సొంతింటి కల నెరవేర్చిన మహానుభావుడు, ఆత్మబంధువు సీఎం కేసీఆర్‌ గారు అని అన్నారు.

రాష్ట్రంలో ఇళ్లు లేని ప్రాంతంలో వారు ఉండకూడదు అనేదే కేసీఆర్ గారి ఆకాంక్ష అని అన్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ గృహలక్ష్మి వర్తింపజేస్తామని, ముఖ్యమంత్రి మానస పుత్రిక గృహ లక్ష్మి పథకమని పేర్కొన్నారు.

గృహలక్ష్మి పథకం నిరంతరం ప్రక్రియ అని, తెలంగాణలో సంపద పెంచి, పేదలకు పంచడమే సీఎం కేసీఆర్‌ గారి ప్రధాన లక్ష్యమన్నరు.

అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా ఉందని, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని స్పష్టం చేశారు.

పార్టీల కతీతమైన ప్రజాసంక్షేమమే బీఆర్ఎస్ ప్రధాన ఎజెండా.. గత పాలకుల హయాంలో గ్రామాలకు లక్ష రూపాయల నిధులు తేవాలంటే సాధ్యం కాని దారుణమైన పరిస్తితులు ఉంటే, నేడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యాక పెన్షన్లు, రైతుబంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, బిసి బంధు, ఆసరా పెన్షన్లు, వంటి సంక్షేమ పథకాల కోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేసిన ఘనత BRS ప్రభుత్వంకే దక్కుతుందన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలోని నిత్యం పేదల సంక్షేమం కోసం ఆలోచించేది ఒక్క కెసిఆర్ గారే అని మళ్ళీ BRS ప్రభుత్వంను కాపాడుకోవాలని కోరారు.

కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, AMC చైర్మన్ దోరేపల్లి శ్వేత, సుడా చైర్మన్ విజయ్ కుమార్, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, కార్పొరేటర్ రాపర్తి శరత్, బుర్రి వెంకట్ కుమార్, పగడాల శ్రీవిద్య నాగరాజు, మోతారపు శ్రావణి, పైడిపల్లి రోహిణి సత్యనారాయణ, ధనాల రాధ, మందడపు లక్ష్మీ మనోహర్, కమర్తపు మురళీ, పాకాలపాటి విజయ నిర్మల శేషగిరి రావు, కన్నం వైష్ణవి ప్రసన్న కృష్ణ, దండా జ్యోతి రెడ్డి, మక్బూల్, నాయకులు ధనాల శ్రీకాంత్, బుర్రి వినయ్ కుమార్, బండారు శ్రీనివాస రావు, సూత్రాల శ్రీను తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed