




ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండలం గణేశ్వరం, వేపకుంట్ల గ్రామాల్లో రూ.1.58 కోట్లతో చేపట్టిన అభివృద్ది పనులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ప్రారంభించారు.
▪️వేపకుంట్ల గ్రామంలో రూ.1కోటితో చేపట్టిన పలు అభివృద్ధి పనులు, నూతనంగా ఏర్పాటు చేసిన హై-మాస్ట్ లైట్స్ ను ప్రారంభోత్సవం చేశారు.
▪️గణేశ్వరం గ్రామంలో రూ.58 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్స్ నిర్మాణ పనులు, నూతనంగా ఏర్పాటు చేసిన హై-మాస్ట్ లైట్స్ ను ప్రారంభోత్సవం ప్రారంభోత్సవం చేశారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ప్రభుత్వం అందిస్తున్న బతుకమ్మ చీరలు, స్పోర్ట్స్ కిట్స్ ను పంపిణి చేశారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామీణ వాతావరణం అర్బన్ వాతావరణం కలగలిపిన మండలం రఘునాథపాలెం మండలం.
మండలంలో ని ప్రతి గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆసరా పెన్షన్లు, రైతు బంధు, రైతు భీమా, BC బంధు, దళిత బంధు, రైతులకు వ్యవసాయ కోసం ఉచిత విద్యుత్, కళ్యాణ లక్ష్మీ/షాది ముభారక్, అంగన్వాడీ నుండి పౌష్ఠిక ఆహారం.. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం, మగ బిడ్డ పుడితే రూ.12వేలు, ఆడ పుడితే రూ.13వేలు, ప్రసవం తరువాత కేసీఅర్ కిట్ ఇలా ప్రతి నిత్యం కేసీఅర్ గారు పేద కుటుంబానికి పెద్ద అదిక్కులా ఉన్నాడు..
ప్రభుత్వం అందిస్తున్న కళ్యాణ లక్ష్మీ/షాది ముభారక్ చెక్కులను నేనే స్వయంగా ఇంటింటికీ వచ్చి చెక్కులు ఇచ్చినం.
పోడు వ్యవసాయం చేసుకుంటున్న వారి భూములకు పట్టాలు ఇచినం.
ఇక్కడకి కలెక్టరేట్ తీసుకువచ్చినం. మండలంలోని పలు గ్రామాలకు అనుసంధానంగా ఉంది కలెక్టరేట్. తద్వారా మన ఆస్థుల విలువలు గణనీయంగా పెరిగాయి.
ఐదు సంవత్సరాల క్రితం ఇక్కడ భూముల విలువ ఎంత ఉంది.. నేడు ఎంత ఉంది. ఎకరం రూ.20 లక్షల నుండి నేడు రూ.2.50 కోట్లకు పలుకుతుంది.
ఇంత ధరలు అందుకు పెరిగినాయి.. ఎలా పెరిగినయి.. ఉరికనే పెరిగిందా.. BRS ప్రభుత్వం ఏం అభివృద్ది చేయకుండా నే పెరిగిందా..
కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతులకు కేవలం 3 గంటల విద్యుత్ చాలు అంటాడు.. కోమటిరెడ్డి ఏమో 8గంటలు చాలు అంటాడు.. మీకెందుకు కడుపు నొప్పి. రైతుల కు ఏమి చేయాలో కేసీఅర్ గారికి తెలుసు. ..
కాంగ్రెస్ ప్రభుత్వంలో అసలు కరెంట్ ఉండేనా.. ఉన్నదా అసలు. కాలిపోయిన మోటార్ లతో రైతుల అరిగొస మర్చిపోదామా. మీరు రైతులను పెట్టిన ఇబ్బందులు ఇంకా కళ్ళ ముందే కదలాడుతూన్నాయి.
రైతులకు కనీసం వ్యవసాయానికి కావాల్సిన పరికరాలు ఇస్తిరా.. రైతుల ఆత్మహత్యలు గుర్తున్నాయా.. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల ఆత్మ హత్యలు ఎన్ని జరిగాయో లెక్క తియమంటావా..
ఎరువుల కోసం విత్తనాల కోసం ఎంత గోస పడినం. విత్తనాల లారీలు వేస్తే రైతుల పై లాఠీ ఛార్జీలు చేసిన ఘటనలు మర్చిపొదామా..
మీ ప్రభుత్వ హయం లో మీరు ఇచ్చిన పెన్షన్ ఎంత..? కేవలం రూ.200 ఇచ్చారు.
ఇక్కడ కేసీఅర్ గారు ఇస్తున్న రూ.2 వేల పెన్షన్ లు ఇస్తుంటే కాంగ్రెస్ రూ.4 వేలు ఇస్తాం అని చెప్తుంది.. దమ్ముంటే మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇవ్వండి.. అక్కడ ఎందుకు ఇవ్వరు.
ప్రజలను మోసం చేయడం తప్ప మీకు ఎం చేతననైతది.. అధికారంలోకి రావాలనే ఒకే కోరిక తప్ప ప్రజలపై, రైతుల పై మీకేమైనా బాధ్యత ఉందా..? వారి సంక్షేమం పట్ల మీకేం చిత్తశుద్ధి ఉంది..
కరెంట్ కోతలకు, స్కాంలకు, దౌర్జన్యాలకు, ప్రజా సొమ్ము దోపిడీకి నిలువుటద్దం కాంగ్రెస్ పార్టీ..
కేసీఅర్ చెప్పినవన్ని చేసి చూపించారు. రేపు కేసీఅర్ గారి 16వ తేదీన వరంగల్ సభలో ప్రకటించే పథకాలకు ప్రతిపక్షాల కాళ్ళ కింద భూ ప్రకంపనలు వస్తాయి..
మీ కళ్ళు బైర్లు కమ్మాతాయి. ఇప్పటికే అనేక పథకాలు అందిస్తున్న కేసీఅర్ గారు ప్రతి ఒక్క పథకం నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. రేపు ప్రకటించేవి కూడా అంతే నిబద్దతతో అమలు చేస్తారు.
మీరందరు మళ్ళీ BRS ప్రభుత్వం ను ఆశీర్వదించాలని కోరుకుంటున్న. BRS ప్రభుత్వం ను గెలిపించుకోవడం ద్వారా మన భవిష్యత్ కు బాటలు పడతాయి.
