Khammam/29.10.2023

తేజ న్యూస్ తెలంగాణ ఖమ్మం సిటీ

BRS అభ్యర్థి పువ్వాడకు సంపూర్ణ మద్దతు తెలిపిన ఆర్య వైశ్యలు..

ఖమ్మం నగరం వాసవి గార్డెన్స్ నందు ఆదివారం ఖమ్మం నియోజకవర్గ స్థాయి ఆర్య వైశ్యుల ఆత్మీయ సమ్మేళనం జరగింది.

సమావేశానికి దాదాపు 2వేల మంది ఆర్య వైశ్యులు పాల్గొని BRS పార్టీ ఖమ్మం అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ గారికి తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు.

ఆత్మీయ సమావేశంలో మంత్రి పువ్వాడ కామెంట్స్..

నాకు, నా కుటుంబానికి గుర్రం కుటుంబీకులు చాలా దగ్గరగా ఉంటారు.

ఇది నాకు అచ్చు వచ్చిన సమావేశం, 2014లో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో ఇదే ప్రత్యర్థి నా మీద పోటీ చేశారు.

2014 ఎన్నికల్లో ఇదే సభలో ప్రారంభించిన మన ప్రయాణం ఒక దశాబ్ద కాలం పాటు కొనసాగింది.

ఆర్య వైశ్యులు, వర్తక వాణిజ్య సంఘాల వారికి తలలో నాలుకలా మెలిగాను.

ఆర్య వైశ్యులకు సంబందించి అనేక సమస్యలు ఉన్నాయి.

దేశానికి స్వాతంత్య్రం తీసుకు వచ్చిన మహాత్మా గాంధీ ఆయన మీ కులానికి చెందిన వారే.

ఇవ్వాళ ఉన్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీలు మహాత్మా గాంధీనీ మింగేశారు.

మహాత్మా గాంధీ చేసిన అహింసా పోరాటం గొప్ప పోరాటం, అదే తరహాలో సీఎం కెసిఆర్ గారు పోరాటం చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకుని వచ్చారు.

తెలంగాణ ఉద్యమంలో ఆర్య వైశ్యుల పాత్ర ఎనలేనిది.

కొంతమంది కుహానా మేధావులు వారికే అంతా తెలిసినట్లు కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు.

కంచె ఐలయ్య రచించిన ఓ పుస్తకంలో ఆర్య వైశ్యులను విమర్శించేలా ఉండగా.. మీరు చేసిన ఆందోళనలో నేను పాల్గొని మీకు మద్దతు తెలిపాను.

మా నాన్న నాకు కులాల గురించి చెప్పలేదు నేను అందరి వాడిని.. నాకు ప్రత్యేకంగా కులం అంటూ లేదు.

ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు నిర్వహిస్తుంటే ఆర్య వైశ్యులే అధ్యక్షుడిగా ఉండాలని చిన్ని కృష్ణారావును ఏకగ్రీవంగా ఎన్నుకునేల చేశాను.

ఆర్య వైశ్యులలో ఖమ్మంకు చెందిన వారికి రాష్ట్రస్థాయి పదవి వచ్చేలా కృషి చేస్తా.

వ్యాపార పరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా పోలీసు వారు మీకు సహకరించేలా పోలీసు వారితో ఆ నాడు మాట్లాడా.

గాంధీచౌక్ లో బందించబడిన విధంగా ఉన్న గాంధీ జీ విగ్రహన్ని సుందరీకరించా..

గోళ్ళపాడు ఛానెల్ ఆధునీకరణ ద్వారా త్రీ టౌన్ ప్రాంతంకు ఉన్నత శ్రేణి గౌరవం దక్కింది. అక్కడ అభివృద్ది చేసి సుందరీకరించడంతో ప్రజలు ఇక్కడ ఉండటానికి ఆసక్తి చూపుతున్నారు.

ప్రజలు అడిగిన విధంగా ఖమ్మం అభివృద్ధికి కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించా.

గడచిన 10 ఏళ్లు పని చేసిన నేను మంచి ప్రొడక్ట్ ను అని మీకు తెలుసు. మీరు నన్ను ప్రజల వద్ద చేసిన మంచిని వివరించి ఓట్ల వేసే విధంగా సహకరించండి.

వర్తక వాణిజ్య సంఘాల నుండి నేను అణ పైసా ఆశించలేదు.

నేను వచ్చిన తర్వాత చందా బుక్కులు, రశీదులు బంద్ చెపించా.

రౌడీ షీటర్లు, గుండాలు, కాంగ్రెస్ పార్టీలో రౌడీ షీటర్లు చెలరేగి పోతున్నారు.. వారికి అధికారం ఇద్దామ..?

ఇవ్వాళ నా మీద పోటీ చేసే వ్యక్తి 2014 లో నా మీద పోటీ చేసి ఓడిపోయారు, 2018లో పాలేరులో పోటీ చేసి ఓడిపోయారు.

ఇవ్వాళ కౌగిలించుకున్న ఇద్దరు వ్యక్తులు నన్ను ఓడించేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు, మీ చలువతో గెలిచాను.

2014లో నా మీద ఓడిపోయిన వ్యక్తి కేసిఆర్ గారు పిలిచి మంత్రి పదవి ఇవ్వకుంటే రాజకీయాల్లో కనుమరుగైపోయేవారు.

పాలేరు ఉప ఎన్నికల్లో ఎవరు పోటీ చేసే దిక్కు లేకపోతే నేను పోటీ చేశా అని అసత్య ఆరోపణలు చేస్తున్నారు..

సీఎం కెసిఆర్ గారికి నేనే మంత్రి పదవి ఇప్పించా అని ప్రగల్భాలు పలుకుతున్నారు. ఏమైనా నమ్మశఖ్యంగా ఉందా.

అమ్మకు అన్నం పెట్టలేని వడు.. పినతల్లికి బంగారు గాజులు చేసి పెట్టినట్లు ఉంది ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాటలు..

సీఎం కెసిఆర్ గారు ఏ ఎన్నికలోను ఓటమి పాలవలేదు. నువ్వేమో పోటీ చేసిన ప్రతి ఎన్నికలో ఓటమి పాలయ్యావు.

నువ్వేదో అపర భగీథుడు అన్నట్లుగా చిత్రీకరించుకుంటున్నావ్, అపర భగీథుడు సీఎం కెసిఆర్ గారు అది గుర్తుంచుకో..

భక్తరామ దాసు ప్రాజెక్ట్ కేసీఅర్ గారి ఆలోచన.. నీ హయాంలో పూర్తి చేసినప్పటికీ ఒక్క చెరువు నిండలేదు.. అది నీ చేతకాని తనం కదా..?

నేను భూమి పుత్రుడిని, నేను ఇక్కడే ఉంటా. కానీ నువ్వూ ఓడినా, గెలిచినా ఇక్కడ ఉండవు..

ఇక్కడ పోటీ భూమి పుత్రుడికి, బూతు పురాణానికి మధ్య జరుగుతుంది. ఎవరు కావాలో ప్రజలు తెల్చుకుంటారు.

సొంత పార్టీలో ఎవరిని గెలవనివ్వని వ్యక్తి కాంగ్రెస్ ఖమ్మం అభ్యర్థి.

నేను పని వాడినే కానీ పగవాడిని కాదు.

రౌడీ షీటర్లు చెక్క తుపాకీ పెట్టుకుని వ్యాపారులను బ్లాక్ మెయిల్ చేయాలని చూసిన వారిపై చర్యలు తీసుకుంటే తప్పా..?

నేను లోకల్.. ఇక్కడే ఉంటాను. ఎవరు ఎప్పుడు ఫోన్ చేసిన ఎత్తి మాట్లాడతా, కాంగ్రెస్ అభ్యర్థి ఫోన్ ఎత్తడానికి కూడా ఇబ్బంది పడతాడు.

కాంగ్రెస్ పార్టీకి ఇప్పటివరకు సీఎం అభ్యర్థి కూడా లేడు, కాంగ్రెస్ పార్టీకి పవర్ ఇస్తే మన పవర్ కట్.. ఆలోచించుకోండి.. ఆర్యవైశ్యులారా..

నేను అజయ్ గుప్తాను మా నాన్న చెప్తారు.. నేను ఆర్య వైశ్యులలో కలిసిపోతా అని.

నవంబర్ 30వ తేదీన మీరంతా కారు గుర్తుపై ఓట్ వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నా..

ఈ సందర్భంగా గుర్రం ఉమా మహేశ్వర రావు, చెరుకూరి కృష్ణ మూర్తి, చిన్ని కృష్ణారావు, పలువురు మాట్లాడారు.

పువ్వాడ అజయ్ గారి తోటే మా ప్రయాణం చేస్తామని ఆర్యవైశ్యులు స్పష్టం చేశారు.

పువ్వాడ గెలుపులో మా వంతు బాధ్యత పోషిస్తామని ఆర్యవైశ్యుల నాయకులు ఈ సందర్భంగా ఏకగ్రీవ తీర్మానం చేశారు.

ఖమ్మంలో ఎమ్మెల్యేగా
మళ్ళీ పువ్వాడ అజయ్ ఉంటేనే అందరూ సుఖంగా ఉండొచ్చు అని, మన వర్తక, వాణిజ్య, వ్యాపారాలకు కొండంత అండగా నిలబడతారు అని పేర్కొన్నారు. ..

ఇప్పటి వరకు మన వ్యాపార వర్గాల్లో ఎవరికి ఎలాంటి నష్టం గానీ, ఇబ్బందులు కానీ కలుగకుండా కాపలా గా ఉన్న వ్యక్తి పువ్వాడ అన్నారు.

ఎటువంటి ఇబ్బందులు లేకుండా నేటి వరకు మన వ్యాపార లావాదేవీలు నడిచాయి అని, ఇక ముందు కూడా వ్యాపార స్వేచ్ఛ ఉండాలి అని ఆశతోనే పువ్వాడ ను గెలిపించుకుంటాం.

వేరే ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిన వారికి అవకాశం ఇస్తే మన గొయ్యి మనం తోవ్వుకున్నట్టే అవుతుంది అని, ఇది మనకు మన భవిష్య తరాలకు తీవ్ర నష్టం కలుగుతుంది అన్నారు.

అజయ్ అన్నకు మద్దతుగా నిలుద్దాం.. భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుందామని మూకుమ్మడిగా ఆర్యవైశ్యుల పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

సమావేశంలో నియోజకవర్గాల సమన్వయకర్త RJC కృష్ణ , GV మాల్ అదినేత గుర్రం ఉమా మహేశ్వర రావు, భద్రాద్రి బ్యాంక్ చైర్మన్ చెరుకూరి కృష్ణ మూర్తి, వేములపల్లి వెంకన్న బాబు, కార్పొరేటర్ పసుమర్తి రాం మోహన్, వర్తక సంఘం అధ్యక్షుడు చిన్ని కృష్ణా రావు, పులిపాటి ప్రసాద్, గుర్రం తిరుమల రావు, కొత్త వెంకటేశ్వర్లు దేవత అనిల్, కురువెళ్ళ ప్రవీణ్, గోళ్ళ రాధా కృష్ణ, నరేష్, త్రీ టౌన్ ఇంఛార్జి TV బాబు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed