Khammam/06.11.2023

తేజ న్యూస్ తెలంగాణ ఖమ్మం సిటీ

సమాజ సేవలో నిష్ణాతులకు ఆత్మీయ సన్మానం

ఖమ్మం నగరంలోని ఓ హోటల్లో యూనిట్ ఆఫ్ హెల్పింగ్ హాండ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు పాల్గొని మాట్లాడారు.

కార్పొరేటర్ బిజి.క్లెమెంట్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు న్యూరో సర్జన్ డాక్టర్ జగదీష్ బాబు(MS Nuero), ఇటీవలే ఐఎంఏ నిర్వహించిన ఎన్నికల్లో జనరల్ సెక్రెటరీగా ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం పట్ల వారిని శాలువాతో సత్కరించారు.

సన్మాన గ్రహీతలు డాక్టర్ ఎం.ఎస్ న్యూరో సర్జన్ జగదీష్ బాబు, డాక్టర్ టీ.పవన్, డాక్టర్ అంబటి విమల లను అభినందించారు .

అనంతరం దేశవ్యాప్తంగా సేవలు అందిస్తున్న స్వచ్ఛంద సంస్థ వైఎంసిఏ ను ఖమ్మంలో స్థాపించిన సందర్భంగా బ్రోచర్ ను మంత్రి పువ్వాడ ఆవిష్కరించారు.

వైఎంసిఏ మరియు యూనిట్ ఆఫ్ హెల్పింగ్ హాండ్స్ యొక్క విశిష్టత, వారు చేస్తున్న సేవలను మంత్రి పువ్వాడ కొనేయడారు.

సమాజ హితం కోసం పని చేస్తున్న ఈ సంస్థ కోసం తమ వంతు సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు.

పేదరికంలో ఉండి చదువుకోలేని విద్యార్థులకు చేయూతనిస్తు వారి ఆర్థిక పరిస్థితులను బట్టి నిరుపేద కుటుంబాలను ఆదుకోవడనే సంస్థ ముఖ్య ఉద్దేశం అని సంస్థ సభ్యులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ బాబు రత్నాకర్, స్వర్ణకుమారి, డాక్టర్ డి.వెంకట్, కేఎంసి కో-ఆప్షన్ సభ్యురాలు మేరీ జయశీల, సుఖభోగి కోటేశ్వరరావు, జి.ఎల్లయ్య, జెట్టి సుధాకర్, జిపివి శేఖర్ బాబు, కందుల ఉపేందర్, చిలకబత్తిని కనకయ్య, జెపి సత్యానందం, గౌతమి, శిల్ప, గుమ్మడి కనకరాజు, పిల్లి విజయ పాల్, జుగుంట్ల శ్రీనివాస్, పి శేఖర్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed