ఎంపీ వద్దిరాజు లక్ష్మీపురంలో బీఆర్ఎస్ సభ ఏర్పాట్ల పరిశీలన
మన జ్యోతి దినపత్రిక ఖమ్మం జిల్లా బ్యూరో వెంపటి నాయుడు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో సోమవారం మధ్యాహ్నం బీఆర్ఎస్ “ప్రజా ఆశీర్వాద సభ”జరుగుతుంది.ఈ సభకు బీఆర్ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు హాజరై అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగిస్తారు.ఇందుకు సంబంధించి నియోజకవర్గంలోని బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలో ఏర్పాటు చేస్తున్న సభాస్థలిని,హెలిప్యాడును ఎంపీ రవిచంద్ర స్థానిక ఎమ్మెల్యే,పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావుతో కలిసి ఆదివారం మధ్యాహ్నం పరిశీలించారు.పనుల్లో నిమగ్నమైన సిబ్బందికి ఎంపీ వద్దిరాజు పలు సూచనలు చేశారు,సలహాలిస్తూ త్వరితగతిన పూర్తి చేయాల్సిందిగా ఆదేశించారు. ఈ సందర్భంగా బూర్గంపాడు జెడ్పీటీసీ శ్రీలతా రెడ్డి, బీఆర్ఎస్ కొత్తగూడెం నియోజకవర్గ సమన్వయకర్త బత్తినీడి ఆది విష్ణుమూర్తి తదితరులు ఉన్నారు.