




ఈరోజు సాయంత్రం ఖమ్మం పట్టణ 28వ డివిజన్ కార్పొరేటర్ గజ్జల లక్ష్మి, వెంకన్న , కొత్త సీతారాములు, సముద్రాల శ్రీనివాసరావు, పత్తికొండ శ్రీను, నల్లమల్ల ఆనంద్, రాజన్న, భద్రం గారితో పాటు స్థానిక కాంగ్రెస్ పార్టీ టిడిపి సిపిఐ నాయకులు కలిసి తుమ్మల గారి విజయాన్ని ఆకాంక్షిస్తూ ఏర్పాటుచేసిన సభలో మాజీ పిసిసి అధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు వి హనుమంతరావు గారితో కలిసి పాల్గొన్న.
మాజీ మంత్రివర్యులు అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి.
శ్రీ తుమ్మల నాగేశ్వరావు గారు ఈ కార్యక్రమంలో తుమ్మల గారు మాట్లాడుతూ.
శ్రీరామచంద్రునికి హనుమంతుడు ఎట్లాగో కాంగ్రెస్ పార్టీకి హనుమంత అన్న కాంగ్రెస్ పార్టీకి నమ్మినబంటు
నేను చదువుకుంటున్న రోజుల్లోనే రాజకీయాలలో హనుమంతరావు గారు మంత్రిగా ఎంపీగా ఉమ్మడి రాష్ట్రానికి అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించారు.
నేను మంత్రిగా ఉన్న సమయంలో గోదావరికి వరదలు రావడంతో ఆనాటి ప్రధాని రాజీవ్ గాంధీ గారితో హనుమంతరావు గారు రావటంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేరువేరుగ ఉన్నాగాని ప్రజలకు సేవ చేయగలిగాం .
ఈరోజు నా గెలుపు కొరకు కాంగ్రెస్ పార్టీ విజయం కొరకు వచ్చిన వారి పట్టుదలకు మనం అందరం కూడా మనస్పూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.
ప్రకాష్ నగర్ ప్రాంతంలో మున్నేటిపై రైతులు వారి పంటలను మార్కెట్కు చేర్చుటకై చప్త నిర్మించడం కానీ బ్రిడ్జి నిర్మించడం కానీ నేను మంత్రిగా ఉన్న సమయంలో జరిగినవి.
ప్రకాష్ నగర్ బ్రిడ్జి కడితేనే మీకు ఓట్లు అడుగుతానని ఆనాడు చెప్పి
కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వారితో ప్రకాష్ నగర్ బ్రిడ్జి కొరకై ఆనాడే 10 కోట్ల రూపాయలు మంజూరు చేయించి బ్రిడ్జి నిర్మించాం.
నేను మొదటిసారి 85లో మంత్రిగా ఉన్న సమయంలో మయూరి సెంటర్లో వర్షం వచ్చి పీకల లోతు నీరు చేరడంతో వెంకటగిరి గేటు పైనుండి ఫ్లైఓవర్ నిర్మించాలని రైల్వే మంత్రి గారితో మాట్లాడి. మున్సిపాలిటీ వారి దగ్గర డబ్బులు లేవని చెప్పడంతో ఆనాడు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఏడు కోట్లతో ఆ బ్రిడ్జి నిర్మించాం.
ఈ ప్రాంతంలో పోలీస్ కమిషనరేట్ మంచినీటి సౌకర్యం కొరకు ట్యాంకు నిర్మించి ఈ ప్రాంతానికి వన్నెతెచ్చాము .
ఖమ్మం జిల్లాకు సంబంధించి పూజ్యులు జలగం వెంగళరావు గారు పరిపాలించిన జిల్లా ఆయన గారి అనుచరులుగా మా నాన్నగారు ఉండేవారు.
ఆయన గారికి ఎంత పేరు వచ్చిందో అంతకు మంచి పేరు రావాలని నా కోరిక తప్ప మరొకటి లేదని.
సోనియా గాంధీ గారు హైదరాబాద్ వచ్చి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ఇచ్చి మీ అందరి కొరకై తెలంగాణ ఇచ్చినాను.
ఇప్పుడు దొరల తెలంగాణ దోపిడీ తెలంగాణ సామాన్యులకు ఎంట్రీనే లేదు ఎమ్మెల్యేలు మంత్రులు కూడా బయట గడిపే పరిస్థితి ఏర్పడ్డాయి కావున ఇటువంటి రాజ్యం వద్దు ప్రజారాజ్యం కావాలి కాంగ్రెస్ రాజ్యం కావాలి
ఈసారి ఎన్నికలలో తెలంగాణ ఇచ్చినటువంటి నేను ఒకే ఒక కోరిక కోరుతున్నానని ఆనాటి సభలో ఉన్న పది లక్షల మందిని అడిగారు వారు మాటిచ్చారు
మేము ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాము తెలంగాణ ఇచ్చిన తల్లికి రుణం తీర్చుకుంటాము అని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీకు ఇచ్చిన వాగ్దానాలన్నీ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ ల ద్వారా అందరికీ అందిస్తామని అన్నారు అని అన్నారు.
గత 75 ఏళ్లలో స్వతంత్ర భారతదేశంలో ఏ శాసన సభ్యుడు కూడా ఇంత శాడిస్ట్ గా ఇంత సైకోగా ఎవరు ప్రవర్తించలేదని ఖమ్మం ప్రజలు ఈరోజు చెబుతున్నారు .
రఘునాధపాలెం మండలంలోని గిరిజనులపై కూడా కేసులు పెట్టి బాధలు పెట్టారు.
ఆయన కేసులు పెట్టిన వారందరూ ఓటు వేస్తే నాకు మెజార్టీ వస్తది
ప్రజలందరూ నిర్ణయించుకున్నారు అతనికి ఎక్కడ పంపించాలో మీ అందరికీ తెలుసు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొత్త సీతారాములు గారు కల్లూరు సోమనాథం గారితో పాటు పట్టణ సీనియర్ నాయకులు పాల్గొన్నారు
