





Khammam/23.11.2023
విఎన్ బి న్యూస్ డిస్టిక్ స్టాప్ రిపోర్టర్ వెంపటి నాయుడు
ఖమ్మం BRS అభ్యర్ధి పువ్వాడ అజయ్ కుమార్ గారి గెలుపును కాంక్షిస్తూ తన సతీమణి పువ్వాడ వసంత లక్ష్మీ గారు ఖమ్మం నగరంలో BRS మహిళ కమిటీ అధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఇంటింటి వెళ్లి ఖమ్మం నగరంలో చేపట్టిన అభివృద్ది, పేదలకు అందుతున్న సంక్షేమం ను వివరిస్తూ కరపత్రాలు అందిస్తూ ప్రచారం నిర్వహించారు.
నగరాభివృద్ది కోసం అజయ్ కుమార్ గారు చేసిన పనికి ప్రతిఫలంగా మళ్ళీ కారు గుర్తు పై ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
సిఎం కేసీఅర్ గారిని ఒప్పించి వేల కోట్ల రూపాయలు ఖమ్మం కు తీసుకురావడం వల్లే నేడు ప్రజలకు కావాల్సిన అన్ని మౌళిక సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు.
నగరం మరింత అభివృధ్ది చెందాలంటే వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేయాలని కోరారు.
