







ఎంపీ వద్దిరాజు ఆధ్వర్యంలో మున్నూరుకాపుల ఆత్మీయ సమ్మేళనం
కాంగ్రెస్ పార్టీ మున్నూరుకాపులు,బీసీలకు తీవ్ర అన్యాయం చేసింది:ఎంపీ రవిచంద్ర
బీఆర్ఎస్ మున్నూరుకాపులకు సముచిత గౌరవమిచ్చింది: ఎంపీ రవిచంద్ర
బీఆర్ఎస్ మనది,ముఖ్య భూమిక పోషిస్తున్నం: ఎంపీ రవిచంద్ర
రాష్ట్రంలో శాంతి వర్థిల్లుతున్నది,ప్రగతిపథాన పరుగులు పెట్టి దేశంలో అగ్రస్థానంలో నిలిచింది: ఎంపీ రవిచంద్ర
మంత్రి పువ్వాడ ఖమ్మం ను గొప్పగా అభివృద్ధి చేశారు:ఎంపీ రవిచంద్ర
మంత్రి పువ్వాడతో జిల్లాలోని అన్ని స్థానాలను గెలిపించుకునేందుకు మున్నూరుకాపులం మరింత సంఘటితంగా ముందుకు సాగుదాం: ఎంపీ రవిచంద్ర
ఎంపీ రవిచంద్ర ఆధ్వర్యంలో గురువారం రాత్రి ఖమ్మం గొరిల్లా పార్కు ఆడిటోరియంలో మున్నూరుకాపుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది
కాంగ్రెస్ పార్టీ మున్నూరుకాపులు,బీసీలకు తీరని అన్యాయం చేసిందని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మండిపడ్డారు.మున్నూరుకాపులు రాష్ట్రంలో గణనీయమైన సంఖ్యలో ఉన్నా కూడా ఆ పార్టీ కేవలం 3సీట్లు మాత్రమే ఇచ్చిందని,గాలి అనిల్ వంటి ఎంతోమందికి అన్యాయం జరిగిందని ఎంపీ రవిచంద్ర ఆవేదన వ్యక్తంచేశారు.ఆ పార్టీ దృష్టిలో మనం ఒక పని వాళ్లమని,సేవ చేయించుకోవడమే తప్ప మనల్ని నాయకులుగా గుర్తించరన్నారు.
మున్నూరుకాపు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులుగా ఉన్న ఎంపీ రవిచంద్ర ఆధ్వర్యంలో గురువారం రాత్రి ఖమ్మం గొరిల్లా పార్కు ఆడిటోరియంలో ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది.మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విజయాన్ని కాంక్షిస్తూ ఏర్పాటు చేసిన ఈ సమ్మేళనానికి ఖమ్మం నియోజకవర్గానికి చెందిన మున్నూరుకాపు ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రముఖులు,యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ,ఆ పార్టీ, దాని నాయకుల గురించి తాను స్వీయ అనుభవంతో చెబుతున్నానన్నారు.అదే బీఆర్ఎస్ మున్నూరుకాపులకు 10అసెంబ్లీ సీట్లు ఇచ్చిందని,తనను,కేశవరావును పార్లమెంటుకు పంపిందని, రాంమోహన్, విజయలక్ష్మీలను హైదరాబాద్ మహానగరానికి మేయర్లను చేసి సముచిత గౌరమిచ్చిందని ఎంపీ వద్దిరాజు వివరించారు.బీఆర్ఎస్ మన పార్టీ అని,ఇందులో మనం ముఖ్య భూమిక పోషిస్తున్నామని,ఈ పార్టీ ఘన విజయానికి మనమందరం మరింత సంఘటితంగా ముందుకు సాగుదామన్నారు.శాంతి వర్థిల్లుతుండడంతో రాష్ట్రం, హైదరాబాద్, ఖమ్మం నగరాలు ప్రగతిపథాన పరుగులు పెడుతున్నాయని ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు.మంత్రి పువ్వాడతో పాటు జిల్లాలోని 10మంది బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ ఓట్ల మెజారిటీతో గెలిపిద్దామన్నారు.ఈ కార్యక్రమానికి మున్నూరుకాపు సంఘం జిల్లా అధ్యక్షులు పారా నాగేశ్వరరావు అధ్యక్షత వహించి స్వాగతోపన్యాసం చేశారు.సమ్మేళనంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, డీసీసీబీ ఛైర్మన్ కూరాకుల నాగభూషణం, మున్నూరుకాపు ప్రముఖులు కార్పోరేటర్ మడూరి ప్రసాద్,సర్పంచులు శ్రీనివాస్, హరిప్రసాద్, సంఘం ప్రముఖులు మెంతుల శ్రీశైలం, కావేరి ప్రసాద్,జాబిశెట్టి శ్రీనివాసరావు,గీతా వెంకటేశ్వరరావు,మడూరి పూర్ణచంద్రరావు,తీగల విజయ్,పారా ఉదయ్, పగడాల కిశోర్,ముత్యం ఉప్పలరావు, రాపర్తి రాజా తదితరులు వేదికపై ఆశీనులయ్యారు.
ఈ సందర్భంగా యువత మంత్రి పువ్వాడ, ఎంపీ వద్దిరాజులకు పటాకులు కాల్చుతూ, పూలుజల్లుతూ అపూర్వ స్వాగతం పలికారు.”జై తెలంగాణ జైజై తెలంగాణ”, “వర్ధిల్లాలి వర్ధిల్లాలి కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి”,”జిందాబాద్ జిందాబాద్ బీఆర్ఎస్ జిందాబాద్”,”కారు గుర్తుకే మన ఓటు”అనే నినాదాలతో ఆడిటోరియం, దాని పరిసర ప్రాంతాలు హోరెత్తాయి.ఈ సందర్భంగా యువత మంత్రి అజయ్ కుమార్,ఎంపీ రవిచంద్రలను గజమాల, శాలువాలతో ఘనంగా సత్కరించారు.
