

Khammam/24.11.2023
మన జ్యోతి దినపత్రిక తెలంగాణ ఖమ్మం సిటీ
రఘునాధపాలెం మండలం GK బంజర, పాపటపల్లి గ్రామంలో ఖమ్మం BRS అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ గారు రోడ్ షో నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రజలను ఓట్లు అభ్యర్ధిస్తు ముందుకు కదిలారు.
ఈరోజు ఒక విషయం మీదృష్టికి తీసుకురావాలి…
మీ అందరికీ ఓటర్ కార్డ్ వచ్చిందా… ఓటర్ కార్డులో మీగ్రామం పేరు ఉందా.. మీగ్రామం పేరు మార్చింది ఎవరు.. మీ అజయ్ అన్న.
గ్రామం పేరు వచ్చేలా చేసింది ఎవరు…
మీ ప్రాంతాన్ని గ్రామ పంచాయతీ చేసిందెవరు… మీ ప్రాంతాన్ని చిరునామాగా చేసింది ఎవరు.. మీరు మీ కాళ్ళ మీద నిలబడేలా చేసింది ఎవరు… మీ అజయ్ అన్న..
మీరు ఒకసారి ఆలోచన చేయండి. 3400 తాండాలను గ్రామ పంచాయతీలుగా చేయాలని కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుని.. చేసే క్రమంలో నేను 17గ్రామ పంచాయితీలున్న రఘునాథపాలెం మండలాన్ని 37 కు పెoచిన..
అంటే 20 అదనంగా తీసుకు వచ్చిన.. అందులో భాగమే VR బంజర, BK బంజర.. ప్రత్యేక గ్రామాలు గా చేయడం వల్ల మీ గౌరవం, బాధ్యత మరింత పెరిగింది.
అత్యధికంగా మన గిరిజన బిడ్డలే సర్పంచులు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లుగా ఉన్నారు..
మన గిరిజన బిడ్డ మాలోతు ప్రియాంకను జడ్పిటిసిగా గెలిపించుకున్నాం..
పట్టుబట్టి తండాలను గ్రామ పంచాయతీలుగా చేయించిన.
అందుకు మీరు ఈ అజయ్ అన్న ని మళ్ళీ గెలిపించాల్సిన బాధ్యత మీ పై ఉంది కదా..
కేసీఅర్ గారిని ప్రత్యేకంగా కోరిన.. మిరు ఒకసారి ఆలోచన చేయండి సార్… మాకు ఏ పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు.. మా తండాకు ఎంపీపీ కావాలి సార్ అంటే.. ఆ రోజు కేసీఅర్ గారు స్పందించి తండాలను గ్రామ పంచాయతీలు గా చేశారు.
ఆరోజు జరిగిన పరిణామాలన్నీ మీకు తెలుసు.. ఆరోజు ఎంపిటిసి ఎన్నిక ఒక యుద్ధం లెక్కనే జరిగింది…
ఆ ఎంపిటిసి ఎన్నికలో మీ గ్రానికి చెందిన ఒక గిరిజన మహిళను నిలబెట్టి పాపటపల్లి, బికే బంజర, విఆర్ బంజార మూడు గ్రామాలకు చెందిన ఓట్లన్నిoటిని కూడా వేయించి అత్యధిక శాతం ఎంపీటీసిలను గెలిచినo…
అత్యధిక శాతం గెలిచిన ఎంపీటీసీలు కూడా మాకు కావాలి మాకు కావాలి ఎంపీపీ అని పోటీపడ్డారు..
గిరిజనులు అధికంగా ఉన్న గ్రామాలు వీర్లపుడి, పంగిడి, మoచుకొండ, ర్యాoకాతండా, మల్లేపల్లి వుండే…
నేను ఇచ్చిన మాటకు కట్టుబడి నేనేమీ ఆశించకుండా.. కోటేశ్వరరావు అడిగిండు అని మీ మండలానికి ఎంపీపీ పదవి ఇచ్చిన..
మీ ప్రాంతాన్ని గ్రామపంచాయితీ చేసిన, మండలానికి చేసిన ముఖ్యమైన పదవి ఇచ్చిన.. మి GK బంజార గ్రామానికి నేనేమైన అన్యాయం చేసిన్నా..?.
మీ అజయన్న ఒకమాట.. ఎవరినైనా.. ఆరె తురె అన్ననా..?
మీ సంక్షేమం, అభివృద్ది కోసమే కదా పని చేసింది.. అలాంటపుడు మీరు అజయ్ అన్న ని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలు కాదా.
ఎవరెన్ని చెప్పినా వచ్చే ఎన్నికల్లో మన BRS ప్రభుత్వం కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నా…
