ముదిరాజుల ప్రధాన శత్రువు కాంగ్రెస్సే!
- ముదిరాజ్ మహాసభ సలహాదారుడు పిట్టల రవీందర్ ముదిరాజ్
ఖమ్మం : తెలంగాణ రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల జనాభాలో అత్యధిక సంఖ్యను కలిగి ఉన్న ముదిరాజ్ జాతి ప్రజలను కాంగ్రెస్ పార్టీ తరతరాలుగా అనేక రూపాలలో వంచించిందని ముదిరాజులు రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ సౌకర్యాన్ని అనుభవించకపోవడానికి కాంగ్రెస్సే ప్రధాన కారణమని అందువల్ల తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా ముదిరాజుల ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీ గానే చూడాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ సలహాదారుడు శ్రీ పిట్టల రవీందర్ స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆరోపించారు . కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలో కొనసాగిన సమయంలో ముదిరాజులను బిసిడి గ్రూపులో చేర్చి తీవ్రమైన అన్యాయానికి గురిచేసిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఇటీవల కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరిట ప్రకటించిన నివేదికలో ముదిరాజులను బిసిడిలోకి మారుస్తామని హామీ ఇవ్వడం హాస్యాస్పదమని ఆయన అన్నారు వెనుకబడిన తరగతులను ఏబిసిడిలుగా వర్గీకరించిన 1970లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఉ మ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉందని ఆ తర్వాత 2009లో వైయస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జీవో 15 పేరిట తీసుకువచ్చిన ఉత్తర్వులు అమలు కాకుండా నిలిపివేసిన నీచ చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీ దేనిని తిరిగి మళ్లీ ఇవాళ ఎన్నికల్లో ముదిరాజులను వాడుకోవడానికి, వంచించడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలను తిప్పి కొట్టారని ముదిరాజ్ మహాసభ నాయకులు పిట్టల రవీందర్ సూచించారు. కాంగ్రెస్ పార్టీ ముదిరాజులను బిసిడి నుండి బిసి ఏ గ్రూపులోకి మారుస్తూ తీసుకువచ్చిన ఉత్తర్వులను అప్పటి హైకోర్టు నిలువరించిన సందర్భంలోనూ ఆ తర్వాత సుప్రీం కోర్టులో దాదాపు పది సంవత్సరాలకు పైగా కాలయాపన జరిగిన సందర్భంలోనూ కాంగ్రెస్ పార్టీ ముదిరాజులకు వ్యతిరేకంగా వ్యవహరించిన వాస్తవాలను ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని ఆయన కోరారు. ముదిరాజుల రిజర్వేషన్ సమస్య సుప్రీంకోర్టు నుండి తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ పరిధిలోకి తీసుకురావడంలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసిన కృషిని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని రాసున్న కాలంలో ముదిరాజుల రిజర్వేషన్ సమస్యను పరిష్కరించేందుకు శ్రీ కెసిఆర్ నాయకత్వంలోని టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే పరిష్కరిస్తుందని వాస్తవాన్ని కూడా ముదిరాజ్ జాతి ప్రజలు గ్రహించాలని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర నాయకులు శ్రీ పిట్టల రవీందర్ కోరారు. ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులందరినీ అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి ముదిరాజులందరూ కారు గుర్తుకు ఓటు వేసి తమ సత్తా చాటుకోవాలని, టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని మూడవసారి అధికారంలోకి తీసుకురావడం ద్వారా మాత్రమే ముదిరాజుల సమస్యలు పరిష్కారం అవుతాయని విషయాలను గుర్తుంచుకోవాలని ఆయన కోరారు . ఈ సందర్భంగా తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు పిట్టల వెంకట నరసయ్య ముదిరాజ్ మరియు జిల్లా అధ్యక్షులు రావుల హనుమంతరావు లు మాట్లాడుతూ ఎవరు ఏ పార్టీలో ఉన్నా గాని ముదిరాజులకు న్యాయం జరగాలంటే బీసీ డీ నుండి ఏ లోకి మార్చినప్పుడే ముదిరాజ్ అందరికీ న్యాయం జరిగిందన్నారు .


