హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ వారి పత్రిక ప్రకటన
అంతర్ జిల్లా నేరస్థుని పట్టివేత:- వివరాలలోకి వెళితే షేక్ ఇర్ఫాన్ S/o యాకూబ్, వయసు: 26 సం:లు R/o గణేష్ టెంపుల్, కూలీ లైన్ కాలనీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నివాసితుడు.
పైన పేర్కొన్న నిందితుడు 2013 సంవత్సరం నుండి దొంగతనాలు చేయడం ప్రారంభించాడు, గతంలో చాలాసార్లు జైలు జీవితాన్ని అనుభవించి, కొన్ని నెలల క్రితం ఇతని పై పిడి యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపాగా ఇటీవల జైల్ నుండి విడుదల అయినాడు. నిందితుడు తన ప్రవృత్తిని మార్చుకోకుండా అదే దొంగతనాలకు పాల్పడుతూన్నాడు. ఇతను ఖమ్మం, మహబూబాబాద్, మరియు కొత్తగూడెం పరిసర ప్రాంతాలలో దొంగతనాలకు పాల్పడుతూ, ఇల్లందు పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు ఇండ్లలో దొంగతనం చేసి తొమ్మిది వేల రూపాయలతో పాటు ఒక చంద్రహారంని దొంగతనం చేశాడు. ఈ యొక్క దొంగతనాలు ఇతని యొక్క స్నేహితుడు మతిన్ తో కలిసి చేసేవాడు. అంతేకాకుండా మరొక ఇంటిలో అక్టోబర్ నెలలో ఆరు తులాల బంగారం 15 తులాల వెండి దొంగతనం చేసి కొత్తగూడెం జిల్లా పరిధిలోని గుర్తుతెలియని వ్యక్తికి అమ్మి వేసి వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేనాడు. ఇదే విధముగా కొత్తగూడెం జిల్లాలో చుంచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 3 దొంగతనాలు చేయడం జరిగింది. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని మడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలో 2.5 తులాల బంగారం కమ్మలు, చైను మరియు 20 తులాల వెండి 20 వేల రూపాయల నగదును దొంగతనం చేసి మతిన్ అనే నేరస్తుడు పోలీసులకు పట్టుబడి ప్రస్తుతం అతను కారాగారంలో ఉన్నాడు. ఈ యొక్క దొంగతనం అనంతరం వీరిద్దరి మధ్యల దొంగిలించిన సొత్తు గురించి గోడవపడి విడిపోయారు. అనంతరం ఇతను హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఆటో దొంగతనం చేయడానికి ప్రయత్నించిన కేసులో ఇతను నిందితునిగా ఉన్నాడు. తేదీ: 14-12-2023 రోజు ఉదయం బావుపేట క్రాస్ రోడ్ వద్ద హసన్‌పర్తి పోలీసు వారు వాహనముల తనఖి చేయుచుండగా ఇట్టి నేరస్తుడిని పట్టుకొని ఇతనిని పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి విచారించగా, ఇంతకు ముందు చేసిన నేరాల చరిత్ర గురించి చెప్పడం జరిగింది. అతని పట్టుకున్నప్పుడు అతని జేబులో రెండున్నర తులాల బంగారు చంద్రహారం లభించడం జరిగింది, ఇది ఇల్లందులో తాను దొంగిలించినటువంటి సొమ్ముగా పేర్కొన్నాడు. నేరస్తుడు. మొత్తం 30 కేసులలో నిందితుడిగా ఉన్నాడు ఇట్టి నిందితుడిని పట్టుకొనుటలో శ్రీయుత సెంట్రల్ జోన్ డి.సి.పి. యం.డి. భారీ, క్రైమ్ డి.సి.పి. శ్రీ. పి. మురళీధర్, మరియు కాజీపేట ఎ. సి. పి. శ్రీ. డేవిడ్ రాజ్ గారి ఆదేశాల మేరకు హసన్‌పర్తి ఇన్స్పెక్టర్ తుమ్మ గోపి మరియు క్రైమ్ కానిస్టేబుల్ వి. క్రాంతి కుమార్, నాగరాజు, మధు, సోమన్న మరియు గీత సంఘటన స్థలానికి వెళ్లి అతన్ని చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది మరియు కమిషనరేట్ లో మరికొన్ని దొంగతనాలు జరుగకుండా నిరోధించారు, కావునా శ్రీయుత వరంగల్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, ఐపీఎస్ గారు సంబంధిత పోలీసు వారిని అభినందించడం జరిగింది.

ByVNB News

Dec 14, 2023

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed