తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నూతన సచివాలయంలో థర్డ్ ఫ్లోర్ లో రూమ్ నెంబర్ 27,28,29 లో నూతన చాంబర్ లో బాధ్యతలు స్వీకరించిన
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్,చేనేత జౌళి శాఖ మంత్రివర్యులు
శ్రీ తుమ్మల నాగేశ్వరరావుగారు మొదటిగా కార్యాలయంలో వేద పండితుల ఆశీర్వచనాలతో స్వాగతం పలికారు. కార్యాలయంలో పూజా కార్యక్రమంలో పాల్గొని వారి చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు ఎమ్మెల్యేలు ఆదినారాయణ గారు, పాయం వెంకటేశ్వర్లు గారు, మట్ట రాగమయి గారు, కోరం కనకయ్య గారు, రాందాస్ నాయక్ గారు, మాజీ ఎమ్మెల్యే వీరయ్య గారు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దుర్గ ప్రసాద్ గారు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ గారు, రాయల నాగేశ్వరావు గారు, నల్లమల వెంకటేశ్వర్లు గారు, తుమ్మల యుగంధర్ గారు, ఏలూరు శ్రీనివాస్ గారు సాదు రమేష్ రెడ్డి గారు, సాధిక్ గారు, కమ్మర్తపు మురళి గారితో పాటు, ఖమ్మం పట్టణ కార్పొరేటర్లు,ఉమ్మడి ఖమ్మం జిల్లా నలమూలాల నుండి వచ్చిన తుమ్మల గారి అభిమానులు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో పాల్గొని అభినందనలు తెలిపారు.