పెద్ద గోపవరంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద క్రేన్ ద్వారా భారీ గజమాల వేసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను సత్కరించిన మధిర నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు.





జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారికి ఘనంగా స్వాగతం పలికిన ఆలయ చైర్మన్ ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ఆలయ ఈవో కొత్తూరు జగన్ మోహన్ రావు.
శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి రాజగోపురం నుంచి ఆలయంలోకి వెళ్లిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ప్రధాన ద్వారం వద్ద పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు ఉప్పల విజయ దేవశర్మ, ఉప్పల మురళీమోహన్ శర్మ, రాజీవ్ శర్మ,
శ్రీ వెంకటేశ్వర స్వామి గర్భాలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కలు చెల్లించుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
పద్మావతి అలివేలు మంగమ్మలను దర్శనం చేసుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఆలయంలోని మహా మండపంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కు వేద ఆశీర్వచనం చేసిన వేద పండితులు రామదాసు విజయకృష్ణ, వెంపటి అభిలాష్ శర్మ,
స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసిన అర్చకులు, లడ్డు, ప్రసాదం, చిత్రపటాన్ని అందజేసిన దేవస్థానం అధికారులు.
మధిర నియోజకవర్గం ఎర్రుపాలెం మండలం జమలాపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని హెలిక్యాప్టర్లో పెద్ద గోపవరం హెలిప్యాడ్
నుంచి హైదరాబాద్ కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెళ్లారు.
డిప్యూటీ సీఎం వెంట ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రెటరీ రిజ్వీ ఐఏఎస్, ఓ ఎస్ డి కృష్ణ భాస్కర్ తదితరులు ఉన్నారు.

