


మహాసభల జయప్రదాని కై రెడ్ షర్ట్ కవర్
బిజెపి ఆర్ఎస్ఎస్ ఫాసిస్టు శక్తులను అడ్డుకునేందుకే విప్లవోద్యమం అవసరం
పిసిసి సిపిఐ ఎంఎల్ జాతీయ కార్యదర్శి సుబసుదేవ్
సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ ప్రజా పంధా యూనిటీ మహాసభల జయప్రదానికై అరుణోదయ కళాకారులు విద్యార్థి యువజన సంఘాల వాలంటీర్స్ ఖమ్మం నగరంలో రెడ్ కవాతు నిర్వహించారు
ఈ రెడ్ కావాలను పిసిసి ఎంఎల్ కార్యదర్శి సుభాషి దేవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విప్లవోద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఈ యూనిటీ మహాసభలు ఉపయోగపడతాయని ఈ మహాసభల నుండి దేశంలో విప్లవద్యమాన్ని ఐక్యం చేయడం కోసం కృషిని కొనసాగిస్తామని. బిజెపి ఆర్ఎస్ఎస్ ఫాసిస్టు శక్తులను అడ్డుకునేందుకు బలమైన విప్లవోద్యమం అవసరమని ఆయన అన్నారు మహాసభలతో ఖమ్మం గడ్డ ఆతిథ్యం ఇవ్వటం ఎంతో ఆనందమని ఆయన అన్నారు. దేశంలో పెట్టుబడిదారీ సమాజం భారతదేశంలో అభివృద్ధి చెందుతున్నపెట్టుబడిదారీ సమాజంగా మారిందని అభివృద్ధి చెందుతున్న పెట్టుబడిదారీ సమాజంతో కార్మిక వర్గాన్ని ఆర్గనైజ్ చేసి నిర్మాణాత్మక పోరాటం చేసి వర్గ పోరాటాలు నిర్మించాల్సిన కర్తవ్యాన్ని కమ్యూనిస్టులు స్వీకరించాలని ఆయన అన్నారు దేశంలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా విప్లకరమైన మార్పులని కమ్యూనిస్టు పార్టీలు తీసుకోవాలని ఆయన సందర్భంగా సూచన చేశారు. ఆదివారం జరగనున్న బహిరంగ సభకు అన్ని వర్గాల ప్రజలు పాల్గొని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని కోరారు ఈ రెడ్ కవత్ సరిత క్లినిక్ ,బస్ డిపో, మయూరి సెంటర్, వైరా రోడ్ , మీదిగా గట్టయ్య సెంటర్ వరకు కొనసాగింది .ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గోకినపల్లి వెంకటేశ్వర్లు రాయల చంద్రశేఖర్ పుల్లయ్య అశోక్ శిరోమణి అరుణోదయ రాష్ట్ర కార్యదర్శి కృష్ణ గడ్డం లక్ష్మయ్య అంజి ఝాన్సీ మంగతాయ్ కేఎస్ ప్రదీప్ రామకృష్ణ ఆజాద్ శోభ రాకేష్ ప్రేమ్ సింగ్ భరత్ మంద సురేష్ వెంకటేష్ యోగానందం తదితరులు పాల్గొన్నారు కళాకారులు డప్పు వాయిద్యాలతో మార్మోగించారు గిరిజన నృత్యాలు చేస్తూ కవాతుల పాల్గొన్నారు.
ఉద్యమాభినందనలతో
ఆవుల అశోక్
జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సిపిఐ (ఎంఎల్) ప్రజా పంధా*
