04-03-24(సోమవారం )- సత్తుపల్లి పట్టణం – మున్సిపల్ ఆఫీస్ – సత్తుపల్లి పట్టణం, సత్తుపల్లి మున్సిపల్ ఆఫీస్ లో EX సఫీషీయో క్రింద సత్తుపల్లి మున్సిపల్ సమావేశాల్లో రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసిన సత్తుపల్లి నియోజకవర్గం MLA డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు… అనంతరం సత్తుపల్లి మున్సిపల్ బడ్జెట్ సమావేశం పాల్గొన్న మంత్రివర్యులు పొంగులేటి శ్రీనన్న, MLA డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు… మున్సిపల్ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన పాత,కొత్త మున్సిపల్ బడ్జెట్ గురించి పలు సూచనలు తెలియజేస్తూ బడ్జెట్ లో చాలా అనవసరమైన ఖర్చు లు వృధాగా వున్నాయ్ అని, సత్తుపల్లి మున్సిపాలిటీల్లో అక్రమాలు జరగుతున్నాయి అని, కొంతమంది ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు అని తెలిపిన MLA గారు.. సత్తుపల్లి మున్సిపల్ అన్ని వార్డు ల్లో మున్సిపల్ సహకారం తో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం సహకారం తో MLA నిధులు కూడా అందిస్తాము …పొంగులేటి శ్రీనన్న మాట్లాడుతూ రాజకీయాల్లో పదవులు ఎప్పటికి శాశ్వతం కాదు… ఆ పదవులు వున్నప్పుడే ప్రజలకు న్యాయం చెయ్యాలి… అలాంటప్పుడు ప్రజలే వారిని ఆదరిస్తారు…తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుంది… గతం లో ఎన్నో సార్లు నాకు ఇక్కడ వున్న పట్టణ కౌన్సిలర్స్ అనేక సాధక బాధాకలు నా దృష్టికి తీసుకువచ్చారు… ప్రతి కార్యక్రమం MLA గారు చూసుకుంటారు… ఈ కార్యక్రమం లో సత్తుపల్లి మున్సిపల్ కమిషనర్ రాజా బాబు,సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ కుసంపూడి మహేష్,వైస్ చైర్మన్ తోట సుజాలరాణి, పట్టణ కౌన్సిలర్స్, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed