నాడు నేడు ప్రజల ఆరోగ్యాలు కాపాడేది గ్రామీణ వైద్యులే…స్పర్శసామాజిక అధ్యయన వేదిక బాధ్యులు భాస్కర్…ఐక్యతే ఆర్ఎంపి ల సమస్యలకు పరిష్కారం..ఘనంగా ఆర్ఎంపిడబ్యూఏ జిల్లా ఎనిమిదోవ మహసభ………హజరైన తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ,జిల్లా నాయకులు…నాడు రవాణా సౌకర్యం లేని రోజుల్లో నేడు అన్ని రకాల సౌకర్యాలు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో ఉన్నప్పటికీ ప్రజలు ప్రాణాలు కాపాడే విషయంలో ఎక్కువ శాతం గ్రామీణ వైద్యులు ఉంటారని స్పర్శ సామాజిక అధ్యయన వేదిక కీలక బాధ్యులు కాకి భాస్కర్ అన్నారు. ఖమ్మం పట్టణంలో ని ఎస్ఆర్ కన్వెన్షన్ హల్లో ఆర్ఎంపిడబ్యూఏ జిల్లా 8వ మహసభ ఆదివారం జిల్లా అధ్యక్షుడు బోమ్మినేని కొండలరావు జిల్లా కార్యదర్శి బోయినపల్లి శ్రీనివాస్ రావు అద్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ వైద్యులను గుర్తించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడకుండా పరిమితమకు మించి వైద్యం చేయకుండా ప్రాథమిక వైద్యం మాత్రమే చేయలన్నారు.అనంతరం గ్రామీణ వైద్యుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు పంగా మల్లేశం స్టీరింగ్ కమిటీ సభ్యులు యం రాజమౌళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం ఎన్ రాజు రాష్ట్ర కోశాధికారి యం నాగేంద్రం ఉపాద్యాక్షులు కొండారెడ్డి ఉమ్మడి క్రిష్ణా జిల్లా అధ్యక్షులు కె క్రిష్ణమూర్తి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు బండి కొమరయ్య రాంమూర్తి లు మాట్లాడుతూ ప్రజలు మనవైపు ఉన్నారని ప్రజలను కుటుంబ సభ్యులుగా భావించి వైద్యం అందించలన్నారు. ఐక్యత తోనే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న గ్రామీణ వైద్యుల సమస్యలు పరిష్కరమౌతాయన్నారు.రెండు రాష్ట్రాలలో ఉన్న ఆర్ఎంపి ల సంఘాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.రాబోయే రోజుల్లో ఐక్య ఉద్యమాలకు శ్రీకారం చూడతామని తెలిపారు. ఈకార్యక్రమంలో ఆర్ఎంపిడబ్యూఏ రాష్ట్ర కమిటీ సభ్యులు కొంగర గోపి కె బిక్షమయ్య నారాయణ రావు ఎస్ కోటేశ్వరరావు జిల్లా గౌరవ అధ్యక్షులు ఆవుకు వెంకటేశ్వర్లు సహయ కార్యదర్శి ఎస్వీ రామారావు జిల్లా ఉపాధ్యక్షుడు జెడి మూర్తి ప్రచార కార్యదర్శి జి రామారావు జిల్లా కమిటీ సభ్యులు షేక్ నాగుల్ మీరా ముజీ టి పి బి చారి మురహరి కాంతారావు అక్కినల్లి నాగేశ్వరరావు పుల్లారెడ్డి మాధవరెడ్డి రహీం కిషోర్ వెంకటరమణ భాస్కర్ శ్రీనివాస్ రావు ఖాసీం జలందర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.అన్నం సేవ ఫౌండేషన్ కి అన్నదానం….ఆర్ఎంపిడబ్యూఏ జిల్లా మహసభ సందర్భంగా మిగిలిన బోజనం కూరలను అన్నం సేవా ఫౌండేషన్ బాధ్యలుకు అందజేశారు. ఈ సందర్భంగా అన్నం సేవా ఫౌండేషన్ నిర్వహకులు శ్రీనివాస్ రావు ఆర్ఎంపిడబ్యూఏ సంఘానికి క్రుతజ్ఞతలు తెలిపారు….

ByVNB News

Mar 10, 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed