ఎంపీ వద్దిరాజు ప్రకటన

ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అక్రమం: ఎంపీ రవిచంద్ర

లోకసభ ఎన్నికలకు ముందు రాజకీయ కక్షతోనే అరెస్టు: ఎంపీ రవిచంద్ర

బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత అరెస్టు అక్రమమని, సుప్రీం కోర్టులో కేసు పెండింగులో ఉండగా రేపో ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న నేపథ్యంలో..ఈ డీ సోదాలపేరుతో అరెస్టు చేయడం తెలంగాణ ప్రజల్లో అనుమానాలకు తావిస్తున్నదని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తీవ్రంగా ఖండించారు.

రాజకీయ సీరియల్ తలపించేలా ఇన్నిరోజులు విచారణ పేరుతో అయోమయానికి గురిచేసిన కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈడీ తీరా లోకసభ ఎన్నికలకు ముందు అకారణంగా అరెస్టు చేయడం రాజకీయ కక్షలకోసం కేంద్ర ప్రభుత్వ సంస్థలను దుర్వినియోగం చేయడమేనని దుయ్యబట్టారు.
ఇది చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడమేనన్నారు.

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రగతి పథంలో ముందుకుపోయిన రాష్ట్రాన్ని చెల్లా చెదురు చేసి తన ఆధీనంలోకి తెచ్చుకునేందుకు బీజేపీ జాతీయ నేతలు పన్నిన రాజకీయ కుట్రలో భాగమేనన్నారు

రాజకీయ కుయుక్తులతో తెలంగాణ సాధకుడు కేసీఆర్ మనోధైర్యాన్ని ఇంచుక మందం కూడా కదిలించలేరని, ఇటువంటి ఎన్నో ఆటుపోట్లను చూసిన ఉక్కుగుండె కేసీఆర్ ది అన్నారు.

ఇటువంటి చర్యలకు బెదిరేదిలేదనీ, ఎంఎల్సీ కవితకు యావత్ తెలంగాణ సమాజం అండగా నిలుస్తుందని స్పష్టం చేసారు.
ఈ వ్యవహారం పై చట్టసభల్లో
న్యాయస్థానాల్లో పోరాడుతామన్నారు-Pulipati Damodar PRO to Vaddiraju Ravichandra MP Gaaru

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed