




ఖమ్మం ప్రతినిధి మార్చి 16 మన జ్యోతి
వ్యవసాయ మార్కెట్ లో పనిచేసే కార్మికులకు ఏకరూప దుస్తులను రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం పంపిణీ చేశారు. రూ. 55 లక్షల విలువ చేసే ఏకరూప దుస్తులను హమాలీ, దడవాయి, రెల్లాడు, స్వీపర్లు, చాటావాల మొదలగు కార్మిక సంఘాలకు మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రూ. 100 కోట్ల వ్యయంతో ఆధునిక మార్కెట్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులకు మంత్రి సూచించారు.
