గెలుపుకు ఖమ్మ(o)ఓట్లే కీలకం
-వివిసి రాజా కందించే అభయ హస్తం
-ఆపారిశ్రామికవేత్త వైపే జిల్లావాసుల చూపు
-ముగ్గురు మంత్రుల సంబంధితులు కూడా పోటీకి సై అంటున్న వైనo
-నేడో రేపో వెల్లడి కానున్న అభ్యర్థుల జాబితా
-దాదాపు ఖరారైన ఆకీలక నేత పేరు
-ఆసక్తిదాయకమైన ఖమ్మం స్థానం
-టికెట్టుకు హస్తం పార్టీలో ముమ్మర పోటీ
ప్రెస్ మీడియా ఫోటో జర్నలిస్టు వెంపటి నాయుడు
ప్రతిష్టాత్మక ఖమ్మం పార్లమెంటరీ స్థానానికి ధీటైన అభ్యర్థి ఎంపిక గతంలో లేని విధంగా కాంగ్రెస్ అధిష్టానానికిప్పుడు పెద్ద తలనొప్పిగా తయారైంది. రాష్ట్రంలో ఎక్కడలేని బిన్న కుల వాతావరణం కేవలం ఈ ఆంధ్ర సరిహద్దు జిల్లాకే పరిమితమైంది. ఎందుకంటే పార్టీలేవైనా అధికారంలో ఎవరున్నా మెజార్టీ శాతమున్న చౌదరి, కమ్మ కుల సామాజిక వర్గాల ఓటు బ్యాంక్ ఎన్నికలలో విజయాన్ని ప్రభావితం చేసే వాతావరణమేర్పడింది. ఈ లోకసభ స్థానానికి ప్రధానంగా ఈ జిల్లా మంత్రుల సంబంధితులకు టికెట్లిస్తే తాము గెలిపించుకొని ఆమ్మ సోనియమ్మకు కానుకిస్తామని వారoటున్నట్లు తెలిసింది. అందుకు ఆ ముగ్గురు అమాత్యులు ఎవరి పట్టుదలలో వారు టికెట్ వేటలో వేరువేరుగా ప్రయత్నాలను ముమ్మరం చేయడం ఆసక్తి కర చర్చనీయాశమైంది. ఎ ఎన్నికలు వచ్చినా, ఈ సామాజిక వర్గ ఓట్ల బలం ఈ జిల్లానే డామినేట్ చేసే ప్రత్యేక పరిస్థితులు దశాబ్ది కాలంగా గెలుపుని శాసిస్తున్నాయి. ఆ సామాజిక వర్గనేతనిక్కడ కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీకి దింపితే ప్రత్యర్థి పార్టీ అభ్యర్థుల పై భారీ మెజార్టీతో గెలుపు సాధ్యమనే పరిస్థితిలున్నాయి. అటువంటి గెలుపు గుర్రమైతేనే భారీ విజయం సాధ్యమని కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తున్నది.
పోటీపడే జిల్లా మంత్రుల అనుచరులు
జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించే సీనియర్ మంత్రి తుమ్మల తనయుడు యుగంధర్, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన డిప్యూటీ సీఎం భట్టి సతీమణి నందిని, గృహ నిర్మాణశాఖ మంత్రి రెడ్డి కులానికి చెందిన పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డిలు పోటీ పడుతున్నారు. వారే కాకుండా కమ్మ కులం నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త వివిసి సంస్థల అధినేత వివిసి రాజా (వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్) పేరు కూడా మార్మోగుతున్నది. పోటీపడే వీరందరికీ ఆ నేతల బ్యాగ్రౌండ్ తప్ప రాజకీయంగా వారందరూ కొత్తవారే. కాంగ్రెస్ హై కమాండ్ తో పాటు పిసిసిచీఫ్, సీఎం రేవంత్ రెడ్డి కూడా వీవిసీ రాజా వైపే ఎక్కువగా మొగ్గు చూపే పరిస్థితులున్నట్లు తెలిసింది. అంతేకాక వివాదాతీతుడు, అoదరిని కలుపుకుపోయే వివిసి రాజా గా చిరపరిచితుడు, మంచిపేరున్న 30 మెగా కంపెనీలకు ఆదినేతైన ఆయనoటే, ఈజిల్లాను శాసించే ఆముగ్గురు మంత్రులకు కూడా అంగీకారం, ఆమోదమన్నట్లు తెలిసింది. పైగా చౌదరైన ఆయన, కమ్మ కుల పక్షపాతి కావడమిప్పుడు కీలకమైంది. సుమారు 3లక్షల ఓట్లున్న ఈ ప్రాంతాన్ని కమ్మ, చౌదరీలు మెజార్టీ శాతం శాసిస్తున్నారు. ఆ తరువాతే మిగతావారు. ఓ సర్వే సంస్థ కూడా ఈ విషయంగా జరిపిన తాజా సర్వేలో వివిసి రాజాకు టికెటిస్తేనే దాదాపు లక్ష 50 వేల ఓట్ల మెజార్టీతో గెలుపు సాధ్యమని హస్తం పార్టీ అధిష్టానానికి సమాచారమoదజేసినట్లు తెలిసింది. ఆయన కాకుండా ఆ ముగ్గురు మంత్రుల సంబంధితులకిస్తే అంత కలహాలతో పార్టీ ఓటమి ఖాయమనే వాతావరణమున్నదని చెప్పినట్లు తెలిసింది. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే ఇదే కమ్మ కులస్తుడు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ అభ్యర్థి, ప్రత్యర్థి నామకు ప్రత్యామ్నాయంగా తప్పని స్థితిలో గెలుపు ఖాయమనే ప్రజలటుoన్నారు.
వివిసి రాజా వైపే మొగ్గు
అభ్యర్థి ఖరారు విషయంగా అనేక కోణాలు పరిశీలించిన అదిష్టానం అన్ని అర్హతలున్న వివిసి రాజా అభ్యర్థిత్వాన్ని చివరకు ఖరారు చేసే వైపే మొగ్గు చూపే అవకాశాలేక్కువగా ఉన్నట్లు తెలిసింది.
ఆ మంత్రుల ఆమోదంతో నేడో రేపో ప్రకటితమయ్యే జాబితాలో రాజా పేరు వెల్లడయ్యే పరిస్థితులు ఉన్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి జలగo వెంగళరావుకు రాజా తండ్రి వెంకట వీరయ్య చౌదరి (వివిసి) ప్రధాన అంచరుడు, మొదటి నుంచి కాంగ్రెస్ కుటుంబమనే బ్యాగ్రౌండ్ కూడా ఆయనకున్నది. ఎన్నికల కోడ్ రావడంతో అన్ని పార్టీల అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా ఆచి తూచి ప్రకటిoచే ఆ జాబితాలో అధిష్టానం రాజా పేరు వెల్లడించే ముందు జిల్లాలోని మంత్రులు ఎమ్మెల్యేలు, రాజ్యసభ ఎంపీ రేణుకచౌదరి వంటి సీనియర్ నేతల వంటి అభిప్రాయాలను కూడా పరిగణలకు తీసుకుని గెలువు బాధ్యతలను వారికప్పగించే యోచనలో ఉన్నట్లు తెలిసింది. రేవంత్ నాయకత్వంలో అధికారంలోకి వచ్చి మoచి దూకుడు మీదున్న పార్టీకి ప్రతీ స్థానం కీలకమని భావిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కీలకమైన ఈ సంకుల సమరంలో ప్రతి సీటు ప్రతిష్టాత్మకoగా భావిస్తున్నది. రాష్ట్రంలోని 17 స్థానాలలో ఈ ఎన్నికల్లో 14 సీట్ల గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులతో ముందుకు పోతున్నది. ఈ నేపథ్యంలో అవసరమైన థీటైన అభ్యర్థులలో ఒకరైన వివిసి రాజాకే దాదాపు ఖమ్మం స్థానం ఖాయమైoదన్న సంకేతాలు జిల్లా పార్టీ కందినట్లు తెలిసింది. జిల్లాలోని ఏకైక స్థానమైన ఖమ్మాన్ని రికార్డు స్థాయి మెజార్టీతో గెలిపించుకునేందుకు
అమాత్యులు, ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు, పార్టీ కీలక నేతలు సిద్ధమైనట్లు తెలిసింది. అవకాశాన్ని చేజార్చుకునే పరిస్థితిలో లేదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.

