ఖమ్మం నుంచి కాంగ్రెస్ లోకసభ అభ్యర్థిగా రాయల ?

మంత్రుల కుటుంబ సభ్యులకు నో చెప్పడంతో రంగంలోకి రాయల

ఖమ్మం ఎంపీ సీట్ కోసం రాయల నాగేశ్వరరావు తీవ్ర ప్రయత్నం

జిల్లా మంత్రులను కలిసి తనకు మద్దతు ఇవ్వాలని కోరిన రాయల

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఎంపిక విషయం రోజుకొక మలుపు పూటకొక పేరుతో తలనొప్పిగా తయారైంది …ఇంతకీ ఖమ్మం లోకసభ సీటు కమ్మ సామాజికవర్గం నుంచే ఇస్తారా …అయితే ఎవరు స్థానికుడైన రాయల కా ..? మాజీమంత్రి మండవ కా …?అనేదానిపై జిల్లాలో రసవత్తర చర్చ జరుగుతుంది …స్థానికేతరుడిని ఎంపిక చేస్తారని వస్తున్న వార్తల నేపథ్యంలో కార్యకర్తలు పెదవి విరుస్తున్నారు …మంత్రుల కుటుంబసభ్యుల్లో ఒకరికి ఇస్తే మరొకరితో ఇబ్బందులు ఉంటాయని భావించిన అధిష్టానం వారికీ టికెట్ ఇవ్వడంలేదని స్పష్టం చేసింది … జిల్లాకు చెందిన మంత్రులు వారి కుటుంబసభ్యులు కాకుండా వేరే పేర్లు సూచించాలని చెప్పడంతో ఏమి పాలుపోని పరిస్థితిలో మంత్రులు ఉన్నారు …

స్థానికులు కాకుండా స్థానికేతరుల పేర్లు ప్రచారంలోకి రావడంతో పార్టీకి ఇబ్బందులను కొని
తెచ్చి పెట్టె అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి …ఈనెల 12 వ తేదీన అభ్యర్థి ఎంపిక ఖరారు అవుతుందని అందువల్ల ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై రాష్ట్ర పార్టీ స్పీడ్ పెంచింది …ఇక జిల్లాకు చెందిన మంత్రుల మాట కూడా కీలకం కానుండటంతో ఆశావహులు వారి చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు … ఎమ్మెల్సీ గా పోటీ చేసి అప్పుడు అధికారం లో ఉన్న BRS పార్టీకి గట్టి పోటీ ఇచ్చారు రాయల నాగేశ్వరరావు.గత ఎన్నికల్లో పాలేరు టికెట్ ను సైతం ఆశించినప్పటికీ టిక్కెట్ రాలేదు.ఇప్పుడైనా రాయల నాగేశ్వరరావు తనకు ఖమ్మం ఎంపీ సీటు ఇవ్వాలని గట్టిగా కోరుతున్నారు …ఈవిషయమై ఇప్పటికే జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ను , మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలకు కలిసి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం … వారు ఆయన మాటలు విన్నప్పటికి స్పష్టమైన హామీ ఇవ్వలేదని తెలుస్తుంది … మాజీమంత్రి నిజామాబాద్ జిల్లాకు చెందిన మండవ వెంకటేశ్వరరావు కొత్తగా పేరు చేరింది … ఈయనకు మంత్రి తుమ్మలతో మంచి స్నేహసంబంధాలు ఉన్నాయి .. జిల్లాలో కార్యకర్తలు మాత్రం స్థానికులకే టికెట్ ఇవ్వాలనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు …జిల్లాలో పోటీచేసే వారు ,లోకసభకు వెళ్లే అర్హత ఉన్నవాళ్లు చాలామంది ఉన్నారని అలాంటి వారిని ఎంపిక చేయాలి కానీ బయటవారిని తేవడం ఏమిటనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఆశించిన సీట్లు వేరే వారికీ ఇచ్చినప్పటికీ పార్టీ అధికారంలోకి రావాలనే సదుద్దేశంతో టిక్కెట్లను త్యాగం చేసినవారి పేర్లు పరిశీలించాలని డిమాండ్ ముందుకు వస్తుంది …కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు కష్టకాలంలో ఆయా నియోజకవర్గాలలో పార్టీని కాపాడుకుంటూవచ్చిన వారికీ టికెట్ ఇవ్వాలని కార్యకర్తలు కోరుతున్నారు ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed