



ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 11 మన జ్యోతి
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నవయుగ వైతాళికులు సామాజిక తత్వవేత్త మహాత్మ జ్యోతిరావు పూలే గారి 198వ జయంతిని ఘనంగా తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఖమ్మం ఆధ్వర్యంలో టీజీవో భవనం నందు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ గెజిటెడ్* అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు *శ్రీ *ఏలూరి శ్రీనివాసరావు టీజీవో ఖమ్మం జిల్లా అధ్యక్షులు శ్రీ కస్తాల సత్యనారాయణ కార్యదర్శి మోదుగు వేలాద్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది.. ముందుగా మహాత్మ జ్యోతిరావు పూలే గారి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించినారు … ఈ సందర్భంగా ఏలూరి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ… బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం వారి జీవితాన్ని త్యాగం చేసి బాల్య వివాహాలు నిర్మూలనకు కృషిచేసి… సత్యశోధక్ సమాజ్ స్థాపించి సమాజంలో ఉన్న కుల నిర్మూలన నీ నిర్మూలించడానికి నిరంతరం శ్రమించిన శ్రామిక జీవి మహాత్మా జ్యోతిరావు పూలే గారు ..వారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారికి అదేవిధంగా సామాజిక సంస్కర్తలకు మార్గదర్శకులు.. వారి అడుగుజాడల్లో మనమందరం ముందుకు వెళ్లాలని వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని తెలియజేయడం జరిగింది… ఈ కార్యక్రమంలో టి జి ఓ అసోసియేట్ ప్రెసిడెంట్ రమేష్ జిల్లా ట్రెజరర్ శేషు ప్రసాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు వల్లోజి శ్రీనివాసరావు ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ వెంటపల్లి సత్యనారాయణ భద్రాద్రి కొత్తగూడెం టీజీవో అసోసియేట్ ప్రెసిడెంట్ బానోత్ దస్ర్రు వేల్పుల శ్రీనివాసరావు ప్రసన్న కుమార్ ఎన్ వి కృష్ణారావు కనపర్తి వెంకటేశ్వర్లు టీజీవో ప్రధాన కార్యదర్శి సుధారాణి లావణ్య జే.వి రామకృష్ణ పి వీరస్వామి టీఎన్జీవో నాయకులు గంగవరపు బాలకృష్ణ తాళ్లూరి శ్రీకాంత్ జయపాల్ హరికృష్ణ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు…
ఇట్లు
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఖమ్మం.
