





ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ ముదిగొండ సమావేశంలో..
ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 13 మన జ్యోతి
బీజేపీ పాలకులు తమకు వ్యతిరేకంగా మాట్లాడే వారిపై ఐటీ,డీ, సీబీఐలతో దాడులు చేయిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నరు: ఎంపీ రవిచంద్ర
బీజేపీ నాయకుల వేధింపులకు మహానేత కేసీఆర్, వారి బాటలో ముందుకు సాగుతున్న తాము భయపడే ప్రసక్తే లేదు: ఎంపీ రవిచంద్ర
కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ లేదు,కులగణన జరుగకుండా మహిళా రిజర్వేషన్స్ అమలు కావు:ఎంపీ రవిచంద్ర
బలమైన నాయకుడు నామ నాగేశ్వరరావు పార్లమెంటులో ఉంటే మహిళా, బీసీ రిజర్వేషన్స్ అమలు జరగడం ఖాయం: ఎంపీ రవిచంద్ర
పొరపాటును సరిదిద్దుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నరు,లోకసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం తథ్యం: ఎంపీ రవిచంద్ర
బీఆర్ఎస్ ఖమ్మం లోకసభ నియోజకవర్గ ఎన్నికల సన్నాహాక సమావేశం శనివారం ముదిగొండ మండల కేంద్రంలో జరిగింది
ఎంపీ రవిచంద్ర లోకసభలో బీఆర్ఎస్ పక్ష నేత, ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి నాగేశ్వరరావు, పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ మధు, మాజీ ఎమ్మెల్యే కోటేశ్వరరావు, జెడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజ్, డీసీసీబీ మాజీ ఛైర్మన్ కూరాకుల నాగభూషణంలతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు
బీజేపీ పాలకులు తమకు వ్యతిరేకంగా మాట్లాడే నాయకులపై ఐటీ,ఈడీ, సీబీఐలతో దాడులు చేయిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు.బీజేపీ పాలకులు బనాయిస్తున్న కేసులు,వేధింపులకు మహానేత కేసీఆర్,వారి బాటలో నడుస్తున్న బీఆర్ఎస్ నాయకులు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ ఖమ్మం లోకసభ నియోజకవర్గ ఎన్నికల సన్నాహాక సమావేశం శనివారం ముదిగొండ మండల కేంద్రంలో జరిగింది.ఈ సమావేశానికి రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, లోకసభలో బీఆర్ఎస్ పక్ష నేత, పార్టీ నియోజకవర్గ అభ్యర్థి నామ నాగేశ్వరరావు,బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే,విత్తనాభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, డీసీసీబీ మాజీ ఛైర్మన్ కూరాకుల నాగభూషణంలతో ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదని,కుల గణన చేయాలనే బలమైన డిమాండ్ ను బీజేపీ పాలకులు పెడచెవిన పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కుల గణన జరుగకుండా మహిళా, బీసీ రిజర్వేషన్స్ అమలు సాధ్యం కాదని ఎంపీ వద్దిరాజు వివరించారు.బలమైన నాయకులు నామ నాగేశ్వరరావు తిరిగి ఎన్నికై పార్లమెంటులో ఉంటేనే మహిళా,బీసీ రిజర్వేషన్స్ అమలు కావడం ఖాయమన్నారు.అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జరిగిన పొరపాటును సరిదిద్దుకునేందుకు ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని, నాగేశ్వరరావుతో పాటు మెజారిటీ సీట్లలో బీఆర్ఎస్ ను గెలిపించడం ద్వారా కేసీఆర్ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయాలని ఎదురు చూస్తున్నారన్నారు.తాజా ఎన్నికల సర్వేలన్నీ కూడా బీఆర్ఎస్ కు సానుకూల ఫలితాలు వస్తాయని చెబుతున్నాయని ఎంపీ వద్దిరాజు వివరించారు.
సమావేశానికి ఎంపీపీ సామినేని హరిప్రసాద్ అధ్యక్షత వహించగా, నాయకులు కొండవల కోటేశ్వరరావు, లక్ష్మారెడ్డి,పోట్ల ప్రసాద్,గడ్డం వెంకటేశ్వర్లు గౌడ్,మేగడ శ్రీనివాస్ యాదవ్, తోట ధర్మారావు,బంక మల్లయ్య,అనంతరెడ్డి,మందరపు వెంకన్నలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా “జై తెలంగాణ జైజై తెలంగాణ”,”వర్థిల్లాలి వర్థిల్లాలి కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి”,”జిందాబాద్ జిందాబాద్ బీఆర్ఎస్ జిందాబాద్”,”కారు గుర్తుకే మన ఓటు”,”గెలిపిద్దాం గెలిపిద్దాం బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావును గెలిపిద్దాం”అనే నినాదాలతో సమావేశం హోరెత్తింది.రాజ్యసభకు రెండో సారి ఏకగ్రీవంగా ఎన్నికై పదవీ ప్రమాణం చేసిన రవిచంద్రకు పలువురు ప్రముఖులు, నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
