ఆదివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ మరియు ఐటిడిఏ పిఓ రాహుల్ తో కలిసి అశ్వరావుపేట మండలం పెదవాగు ప్రాజెక్టు గండి ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం గుమ్మడవెల్లి గ్రామంలో వరదల వల్ల దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించి, అక్కడ ప్రజలతో మాట్లాడి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలియజేశారు. మండలంలో వరద తాకిడి వల్ల నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహాయక చర్యలుచేపట్టాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.

అనంతరం దమ్మపేట మండలం కొత్తూరు గ్రామం లో గల గిరిజన మహిళా డిగ్రీ కళాశాల లో ఇరిగేషన్, రెవెన్యూ,పంచాయతీ, విద్యుత్, వైద్యం, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, ఐటీడీఏ మరియు పోలీస్ అధికారుల తో వరద వల్ల జరిగిన పంట నష్టం మరియు తర్వాత తీసుకో వలసినచర్యల పై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ముందు గా నీటి పారుదల శాఖ అధికారులను గండి పడటానికి గల కారణాలను వారు తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఇరిగేషన్ ఈ ఈ ని ప్రాజెక్టుని ఎప్పుడూ తనిఖీ చేశారు అని ప్రశ్నించగా జూన్ నెలలో చేశామని సమాధానం ఇచ్చారు. జులైలో ఎందుకు నిర్వహించలేదని ఆగ్రహించారు. వరదను ముందుగా అంచనా వేసి గేట్లను తెరిచి ఉంటే నష్టం వాటిల్లేదు కాదని తెలిపారు.ప్రాజెక్టు గండి పడటానికి గల కారణాలనుసమగ్ర విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలనికలెక్టర్ ను కోరారు.

రెవెన్యూ అధికారులను వరదలు అనంతరం తీసుకున్న చర్యలు పై వివరణ అడగగా ఆర్డిఓ కొత్తగూడెం మాట్లాడుతూ వరద గురి అయిన గుమ్మడవల్లి, కొత్తూరు, ఆనంతారం గ్రామాలలోని 70 కుటుంబాలకు చెందిన 250 మందికి పునరావాసం కల్పించామని తెలిపారు. కుటుంబానికి పది కేజీల బియ్యం, కందిపప్పు మంచి నూనె ప్యాకెట్, కూరగాయలు ఈరోజు సాయంత్రం లోపల అందజేయాలని మంత్రి ఆదేశించారు.

జిల్లా పంచాయతీ అధికారితో మండలంలోని అన్ని గ్రామాలలో నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని, బ్లీచింగ్, ఫాగింగ్ మరియు శానిటేషన్, సురక్షిత మంచినీరు అందించాలని. వరదల అనంతరం అంటూ వ్యాధులు ప్రబలకుండా పరిశుభ్రత పాటించాలని మంత్రి ఆదేశించారు.

విద్యుత్ శాఖ వారితో మాట్లాడుతూ అన్ని గ్రామాలలో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ సరఫరా పునరుద్దించాలని ఆదేశించారు.
వైద్యశాఖ అధికారులతో మాట్లాడుతూ వరదల అనంతరం గ్రామాలలో ప్రజలు విష జ్వరాల బారిన పడతారని, ప్రతి గ్రామంలో ఏఎన్ఎంలు, అంగన్వాడి ఆశాలతో ఇంటింటికి సర్వే చేయించి ప్రజల ఆరోగ్యాలు తెలుసుకోవాలని ప్రజల ఆరోగ్యం బాధ్యత ప్రభుత్వ వైద్యుల దేనని, అదనంగా సిబ్బంది,వాహనం అవసరమైతే జిల్లా కలెక్టర్ గారికి ప్రతిపాదన పంపాలని ప్రజల ఆరోగ్యం పట్ల ఎటువంటిది నిర్లక్ష్యం వహించరాదని హెచ్చరించారు. వైద్య మరియు పంచాయతీ శాఖ సమన్వయంతో అంటువ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
పంచాయతీరాజ్ మరియు.
రోడ్లు భవనాల ఇంజనీర్లతో మాట్లాడుతూ వరద వల్ల తెగిపోయిన రోడ్లు, ఓవర్ బ్రిడ్జిలు వద్ద జరిగిన డ్యామేజీ కి ముందుగా గ్రావెల్ పోసి ప్రజారావాణా కి ఇబ్బంది కలగకుండ చూడాలన్నారు. వర్షాలు తగ్గాక శాశ్వత ప్రాతిపదికన రోడ్డు రిపేరు చేయొచ్చు అన్నారు.
జిల్లాలోని అన్ని పాఠశాలలో శిథిలావస్థ లో వున్న భవనాలు గుర్తించి వెంటనే అట్టి భవనాలను కూల్చివేయాలన్నారు. ప్రత్యామ్నాయంగా వాటి స్థానంలో తాత్కాలికంగా షెడ్లు లేదా వేరే భవనంలోనికి పాఠశాలలు మార్చాలని విద్యార్థులకు రక్షణ కల్పించాలన్నారు.

వ్యవసాయ మరియు ఉద్యానవన శాఖ అధికారులతో మంత్రి మాట్లాడుతూ వరద వల్ల అశ్వరావుపేట మండలంలోని వరి పొలాలు ఎంత మేరకు నష్టపోయాయో సర్వే సిద్ధం చేయాలన్నారు, పత్తి పొలాలకు, ఆయిల్ ఫామ్ తోటలలో ఎంతవరకు ఎంత మేరకు ఇసుక మేటలు పేరుకు పోయాయో తనిఖీ చేయాలన్నారు. నష్టపోయిన రైతులు తదుపరి ఏ పంట వేయాలి అనుకున్నారో తెలుసుకుని వారికి తగిన విత్తనాలు అందజేయాలన్నారు.
నష్టపోయిన రైతులు అందరికీ సహాయం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, పూర్తి నివేదిక సిద్ధం చేసి జిల్లా కలెక్టర్ కి సమర్పిస్తే అట్టి నివేదికలను ప్రభుత్వానికి పంపి రైతులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు. వరదల వల్ల నష్టపోయిన ప్రతి రైతు కి ప్రభుత్వ సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.

అశ్వారావు పేట పోలీసు సిబ్బందితో మాట్లాడుతూ వారందరూ ప్రతి గ్రామానికి వెళ్లి గ్రామంలో ఉన్న సమస్యలు తెలుసుకుని జిల్లా కలెక్టర్, మరియు ఎస్పీ గారికి తెలియజేయాలని,విధి నిర్వహణలో ఎటువంటి నిర్లక్ష్యం వహించరాదని, వర్షాకాలం పూర్తి అయ్యేవరకు జిల్లా యంత్రాంగం అందరూ తమ తమ కార్య స్థానంలో ఉండి చిత్తశుద్ధితో పని చేయాలని ఆదేశించారు.

అనంతరం పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పెదవాగు ఘటన చాలా బాధాకరమని దీనివల్ల చాలా ఆస్తి నష్టం తో పాటు గ్రామాల్లో పేదలు చాలా ఇబ్బందికర పరిస్థితులను తెలిపారు. అదృష్టవశాత్తు జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యల వల్ల ఏ ఒక్క ప్రాణ హాని జరగకుండా చూడగలిగామని,ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. వరద ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న రైతులు అందరిని ప్రభుత్వం అన్ని విధాలుగామంత్రి తెలిపారు. కొత్తూరు గ్రామంలో విద్యుత్ ఘాతుకంతో మృతి చెందిన వేణు మురళి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి తెలిపారు. పెద్దవాగు ఉమ్మడి రాష్ట్రానికి చెందినది కాబట్టి రెండు రాష్ట్రాలు నిధులు ఇవ్వాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మాట్లాడి రాబోయే సీజన్లో ఇప్పుడు ఉన్న వరద కు తగ్గట్టుగా పటిష్టమైన డిజైన్ తో శాశ్వత ప్రతిపాదిక పైన ప్రాజెక్టు నిర్మాణం చేపడతామని మూడు గేట్లు అదనంగా ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. వరదల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సెలవులపై వెళ్లరాదని, అధికారులందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ సి ఈ ఏ.శ్రీనివాసరెడ్డి రెడ్డి, ఎస్సీ ఎస్ శ్రీనివాస రెడ్డి,కొత్తగూడెం ఆర్డీవో మధు, వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి,ఉద్యానవన శాఖ అధికారి సూర్యనారాయణ, ఆర్ అండ్ బి ఈ శ్రీనివాసరావు, పంచాయతీ రాజ్ ఈ ఈ శ్రీనివాసరావు, ఎన్పీడీసీఎల్ ఎస్సీ బికం సింగ్, అశ్వరావుపేట తాసిల్దార్, డీఎస్పీ పాల్వంచ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed