*నిర్ణీత గడువులోగా అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలి….. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు

*ఎర్రుపాలెం మండలంలో పర్యటించి పలు రోడ్డు నిర్మాణ, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, జి.పి., ఆరోగ్య ఉప కేంద్ర భవనాలను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి
ఖమ్మం,/మధిర జనవరి 7: (( మన జ్యోతి బ్యూరో ))

నిర్ణీత గడువులోగా అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి వర్యులు భట్టి విక్రమార్క మల్లు అన్నారు.

మంగళవారం ఉప ముఖ్యమంత్రి ఎర్రుపాలెం మండలంలో పర్యటించి రూ. 26.30 కోట్ల వ్యయంతో పలు రోడ్డు నిర్మాణ, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, జి.పి., ఆరోగ్య ఉప కేంద్ర భవనాలకు ప్రారంభోత్సవాలు చేసారు.

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ జిల్లాలో మారుమూల ప్రాంతమైన ఎర్రుపాలెం మండల అభివృద్ధి దిశగా చేపట్టే పనులను నిర్ణిత సమయంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావాలని అధికారులను సూచించారు.

ఎర్రుపాలెం మండలంలో చేపట్టిన అభివృద్ధి పనులు నాణ్యతతో సకాలంలో పూర్తి కావాలని అన్నారు. ప్రస్తుతం చేస్తున్న పనులు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని, నాణ్యత అంశంలో ఎక్కడా రాజీ పడకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.

మీనవోలు గ్రామంలో 21 లక్షలతో చేపట్టిన అంతర్గత సీసీ రోడ్డు నిర్మాణ పనులకు, పేగళ్లపాడు గ్రామంలో 8.80 లక్షలతో సిమెంట్ రోడ్ల నిర్మాణం, మధిర నుండి ఎర్రుపాలేం ఆర్ అండ్ బి రోడ్డు 17/0 కిలోమీటర్ నుండి 21/3 వరకు, ఎర్రుపాలెం పట్టణ పరిధిలో 18 కోట్ల ప్లాన్ నిధులతో నాలుగు వరుసల రహదారి పనులు, ఎర్రుపాలెం గ్రామంలో 30.60 లక్షలతో చేపట్టిన అంతర్గత రోడ్ల నిర్మాణ పనులకు, ఎస్సీ కాలనీలో 11.25 లక్షలతో చేపట్టిన సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులకు, తెల్లపాలెం వద్ద 9.80 లక్షలతో చేపట్టిన 2 సీసీ రోడ్డు నిర్మాణ పనులకు, కండ్రిక గ్రామంలో 7 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపనలు చేశారు.

అనంతరం ఎస్.టి. ఎస్.డి.ఎఫ్. నిధులు 20 లక్షలతో నిర్మించిన కండ్రిక గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాన్ని ప్రారంభోత్సవం చేశారు. బంజర గ్రామంలో 5.30 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు, జమలాపురం గ్రామంలో 19.50 లక్షలతో చేపట్టిన అంతర్గత సీసీ రోడ్డు నిర్మాణ పనులకు, 5 కోట్ల 83 లక్షలతో చేపట్టిన జమలాపురం అటవీ పార్క్ కు శంకుస్థాపనలు చేశారు.

అనంతరం ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణపురం గ్రామంలో ఒక కోటి రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన వెంకటాపురం నుండి గట్ల గౌరారం రోడ్డు అభివృద్ధి పనులకు, సత్యనారాయణ పురం గ్రామంలో 9 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు, నారాయణపురం గ్రామంలో 9.75 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేసి, నారాయణ పురం గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని ప్రారంభించి, వెంకటా పురం గ్రామంలో 15.50 లక్షలతో చేపట్టిన మూడు సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో డిఆర్డీవో సన్యాసయ్య, ఆర్ అండ్ బి ఎస్ఇ హేమలత, పీఆర్ ఇఇ వెంకట్ రెడ్డి, డిపిఓ ఆశాలత, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed