విఎన్బి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు, ఖమ్మం

అడవులు లేనిది.. అభివృద్ధి లేదు.. అభివృద్ధి చెందలేం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

ప్రకృతిని వెంటబెట్టుకొని, ప్రకృతితోనే నడవాలి

అటవీ కార్యాలయ భవన శతాబ్ది వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్


ఖమ్మం, ఫిబ్రవరి -3:

అడవులు లేనిది అభివృద్ధి లేదని, అభివృద్ధి చెందమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. సోమవారం అటవీశాఖ కార్యాలయ భవన శతాబ్ది ఉత్సవాల్లో జిల్లా కలెక్టర్, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డా. సి. సువర్ణ, సిసిఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ డా. భీమా నాయక్, జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్ లతో కలిసి పాల్గొన్నారు.

కార్యక్రమంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అటవీ అధికారులకు నివాళులర్పించారు. అటవీశాఖ లో పనిచేసి పదవీ విరమణ పొందిన, శాఖలో పనిచేస్తున్న అధికారులు తమ అనుభవాలను తెలిపారు. వెలుగుమట్ల అర్బన్ పార్క్ పై డాక్యుమెంటరీ ప్రదర్శించారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రకృతి ని ప్రక్కన పెట్టుకొని, ప్రకృతి వెంట నడిస్తేనే అన్ని విధాలా ప్రయోజనమన్నారు. అటవీశాఖ కార్యాలయం, కలెక్టర్ క్యాంపు కార్యాలయం, పోలీస్ కమీషనర్ క్యాంపు కార్యాలయాల నిర్మాణం వంద సంవత్సరాలకు పైగా జరిగి, ఇప్పటికి ఉపయోగం ఉన్నాయి. ఇన్ని సంవత్సరాలుగా ఎంతో మంది పెద్దలు అద్భుతంగా పనిచేశారు కాబట్టి, మాకు అప్పుడు ఇక్కడ పనిచేసే అదృష్టం కల్గిందని భావిస్తామన్నారు. కనిపించేది కలెక్టర్, సిపి, డిఎఫ్ఓ అయిన, వారి వెనుక పనిచేసేది వందలాది మంది ఉంటారన్నారు.

ప్రతి ఎకరం అటవీ భూమిని కాపాడడానికి అటవీశాఖ అహర్నిశలు కృషి చేస్తుందని కలెక్టర్ తెలిపారు. అడవులు అడవులు అవసరమా అనే భావన ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉందని, అడవులు లేనిది అభివృద్ధి లేదని అన్నారు. కృత్రిమ భవనాలు, వస్తువులు కట్టుకొని కొంతకాలం సంతోషంగా వుండగలమేమో కానీ, వచ్చే తరాలకు అన్య6చేసిన వారమవుతామన్నారు. ప్రతి పండగ లో ప్రకృతి ఉంటేనే అభివృద్ధి అనే నమ్మకం పెట్టుకున్నాం, అదే ఆలోచనతోనే ముందుకు వెళుతున్నామన్నారు.

అడవుల కున్న విలువ, అడవుల అవసరం గురించి విస్తృత ప్రచారం కల్పించి ప్రజల్లో అవగాహన, చైతన్యం తేవాలన్నారు. ప్రకృతిని తోడుపెట్టుకుంటే ఆర్థికంగా బలపడవచ్చు, ఆరోగ్యాoగా బలపడవచ్చు, వచ్చే తరాలకు ఒక మంచి ఆస్తిని ఇవ్వవచ్చన్నారు.

వైల్డ్ లైఫ్, ఎకో టూరిజానికి అటవీశాఖ చేస్తున్న కృషికి సంపూర్ణoగా సహకరిస్తామని కలెక్టర్ అన్నారు. విద్య, వైద్యం, అడవులు అందరికి ఉపయోగంగా వుంటాయని, అందరికి అభివృద్ధి ఇస్తుందని, కాని దాని విలువ కొందరికే తెలుస్తుందని అన్నారు. అందరికోసం కొందరి శ్రమ పనిచేస్తుందని కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో అటవీశాఖ విశ్రాంత అధికారులు, ఎఫ్డివో లు, ఎఫ్ఆర్వో లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి, ఖమ్మం కార్యాలయంచే జారిచేయనైనది.

బుధవారం జిల్లా కలెక్టర్, సత్తుపల్లి డివిజన్ తల్లాడ పరిధిలోని కనకగిరి రిజర్వ్ ఫారెస్ట్ పులిగుండల ప్రాజెక్ట్ ను ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ అభిషేక్ అగస్త్య, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ, జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్ లతో కలిసి పరిశీలించారు.

సుమారు 5 కిలోమీటర్లు అడవిమార్గం గుండా కాలినడకన గుట్ట పైకి ఎక్కి పులిగుండాలను కలెక్టర్ సందర్శించారు.

ఎకో టూరిజం ప్రణాళికలో భాగంగా కలెక్టర్ కమాండర్ జీపులో ప్రయాణించి పచ్చని సోయగంతో ఉన్న అటవీని సంరక్షిస్తూ ఇక్కడ ఆహ్లాదకరమైన పరిస్థితులు ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ కోసం మొత్తం ఏరియాని పరిశీలించారు. పాలపిట్ట ఓరియల్ టవర్ ఎక్కి బైనాక్యులర్ ద్వారా చుట్టుపక్కల ఏరియల్ వ్యూ కలెక్టర్ చూశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఎక్కువగా మనకు ప్రకృతి పరంగా అందమైన గుట్టలు, చెరువు, గుట్టల నుండి జాలూవారే నీళ్ల తో అడవిని పర్యాటక రంగంగా అభివృద్ధి చేసుకోవాలని, దీనివల్ల ఆర్యోగమనే సంపద వస్తుందని అన్నారు. రానున్న తరాలకు పర్యాటక ప్రాంతంగా తీసుకొని వచ్చి ప్రకృతిని కాపాడుతూ, అభివృద్ధి చేస్తామని తెలిపారు.

ప్రకృతిని కాపాడుకోలేక మనకు అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని, దానిని నివారించేందుకు అభివృద్ధి చేపట్టామన్నారు. పులిగుండల ప్రాజెక్టు లో ఆహాద్లం పంచే విధంగా సౌకర్యాలు ఏర్పాటు చేసి సందర్శకులను ఆకర్షించేలా చర్యలు చేపట్టామని కలెక్టర్ తెలిపారు.

పర్యాటకుల కోసం చెరువులో బోటింగ్, వసతి కాటెజ్ లు, భోజనం, త్రాగునీరు వసతులను కల్పిస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ కుటుంబం, పిల్లలతో సందర్శించి ఆనందంగా గడిపేలా కార్యక్రమం తయారు చేస్తామని అన్నారు. చెరువులో సంచరించే పక్షులు, పులిగుండల చరిత్ర చెప్పే విధంగా వినూత్న కార్యక్రమాల నిర్వహణకు గైడ్ లు కూడా అందుబాటులో ఉంటారని అన్నారు. పిల్లలకు సైక్లింగ్, ఓపెన్ జిమ్, అడ్వెంచర్ యాక్టివిటీస్ వంటివి అభివృద్ధి చేస్తామని కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో జెడ్పి సిఇఓ దీక్షా రైనా, అటవీ అభివృద్ధి అధికారిణి మంజుల, అటవీ రేంజ్ అధికారి జి. నాగేశ్వరరావు, అటవీశాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మంచే జారీచేయనైనది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed