ఖమ్మం కార్పొరేషన్ మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు

రమణ గట్టులో భూకబ్జా ఆరోపణలపై కాంగ్రెస్ నేత ముస్తఫా తీవ్ర ఆగ్రహం*

ఇంచు భూమి నీ ఆక్రమించినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసానికి సిద్ధమని సవాల్

జిల్లా మంత్రులను బదనం చెసేందుకు తప్పడు ప్రచారం

దొంగే దొంగ అన్నట్లు, మతి భ్రమించి మాట్లాడుతున్న బి ఆర్ ఎస్ నేతలు

యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఎండి ముస్తఫా

ఖమ్మం: రమణ గుట్టలో భూకబ్జా ఆరోపణలపై కాంగ్రెస్ నేత ముస్తఫా తీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం రమణ గుట్టలో జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ యువజన సంఘం రాష్ట్ర నాయకులు 57 డివిజన్ కార్పొరేటర్ రఫీదా భర్త ముస్తఫా మాట్లాడుతూ బి ఆర్ ఎస్ నేతలకు సవాల్ చేశారు. కొద్దీ మంది అరాచక శక్తులు తమ పై పని కట్టుకోని దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నిరాధారణ ఆరోపణలు చేసే వారు మేము,
ఇంచు భూమిని ఆక్రమించుకున్నట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసానికి సిద్ధమవుతామని సవాల్ విసిరారు.జిల్లా మంత్రులను బదనం చేసేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దొంగే దొంగ అన్నట్టు మతి భ్రమించి బిఆర్ఎస్ నేత చేస్తున్నా ప్రచారమే దీనికి నిదర్శనమని ఆయన అభివర్ణించారు. గత బి ఆర్ ఎస్ పాలనలో రమణగుట్టను తారా స్థాయిలో కబ్జాలు చేసి నిరుపేద ప్రజలను బెదరిస్తూ,భయభ్రాంతులకు గురిచేసి ,కబ్జా లు అక్రమాలకు తెరలేపి కటకటాల పాలైన సంగతి నగర ప్రజలకు తెలుసు అన్నారు.కాంగ్రెస్ పై తమపై తప్పడు ప్రచారం చేస్తూ అభియోగాలు మోపితే రానున్న రోజులలో ప్రజలు తగిన బుద్ధి చెపుతారని హితవు పలికారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed