నూతన కమిటీకి పలువురి శుభాకాంక్షలు..
ఖమ్మం మే 27 VNB న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు


ముస్లిం మైనార్టీల వక్ఫ్ భూముల పరిరక్షణ కోసం, ముస్లిం హక్కుల సాధన కోసం నిర్మితమైన రాజ్యాంగ పరిరక్షణ వేదిక సంస్థ ఫౌండర్, జాతీయ అధ్యక్షులు సయ్యద్ సాదిక్ అలీ సమక్షంలో ఖమ్మం నగరంలోని 2 వ డివిజన్ లో నూతన కమిటీ నియామకం జరిగింది. మంగళవారం ఖమ్మం నగరంలోని 2 వ డివిజన్ పాండురంగాపురంలో గల మస్జిద్ ఎ ఖూబా ఆవరణలో ఆర్ పీ వీ సంస్థ నూతన కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా షేక్ ఖాసిం, అబ్దుల్ వాహేద్, గౌరవ అధ్యక్షులుగా సదర్ మహమ్మద్ ఫయాజ్ ,
గౌరవ సలహాదారులు మౌలానా మహమ్మద్ గులాం రబ్బానీ..(ఆలిమ్), ఉపాధ్యక్షులు గౌస్ పాషా, యాకుబ్ మియా, సహాయ కార్యదర్శులుగా ఏండి. అబ్దుల్ వహీద్, షేక్ హుస్సేన్ మియా,
ఈసీ సభ్యులుగా షేక్ సుభాని, ఎండి సలీం, షేక్ ఇర్ఫాన్, షేక్ జానీపాషా, నాగుల్ మీరా, తడుతరులనునియమించారు.. అనంతరం నూతన కమిటీ బాధ్యులను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గ బాధ్యులు డాక్టర్ నజీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు..
