మన జ్యోతి బ్యూరో జూలై 18 వెంపటి నాయుడు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు శంకర్ నాయక్,మెచ్చా నాగేశ్వరరావులు మాజీ శాసనసభ్యుడు రేగా కాంతారావు మాతృమూర్తి స్వర్గీయ లక్ష్మీనర్సమ్మకు ఘనంగా నివాళులర్పించారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెంలో లక్ష్మీనర్సమ్మ చిత్రపటానికి కేటీఆర్, రవిచంద్ర,అజయ్ కుమార్, సత్యవతి తదితర ప్రముఖులు పూలుజల్లి శ్రద్ధాంజలి ఘటించి,ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు, కాంతారావు,ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.
